ప్రస్తుతం ఎండాకాలం ప్రారంభం కావడంతో ఎక్కువమంది ఈ వేడి నుండి తట్టుకోవడం కోసం పలు రకాలైన పనులను చేస్తూ ఉంటారు. ఇక ఎండాకాలం వచ్చిందంటే చాలు.. ఎక్కడ చూసినా చల్లని పానీయాలు, జ్యూస్ షాపులు, పుచ్చకాయల దుకాణాలు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తూనే ఉంటాయి. అయితే ఇలాంటి పుచ్చకాయ తినడం వల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

పుచ్చకాయలో మొత్తం 90 శాతం నీరు ఉండడం వల్ల ప్రజలు దీనిని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. ముఖ్యంగా ఈ వేసవిలో వీటిని తినడం వల్ల శరీరానికి తగినంత నీటిని కూడా అందిస్తుంది. ఇక మన శరీరానికి అవసరమైన విటమిన్లు, మినరల్స్, ఫైబర్ సమృద్ధిగా ఉండాలి అంటే కచ్చితంగా ఈ పుచ్చకాయ ఎక్కువగా తింటూ ఉండాలి. మన శరీరంలో ఉండే మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండేందుకు ఈ పుచ్చకాయ ఎంతో ప్రయోజనం.

1).పుచ్చకాయలో పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా ఉండడం వల్ల.. రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచడంలో బాగా సహాయపడుతుంది. ఇక అంతే కాకుండా ఇందులో ఎలక్ట్రోలైట్స్ బాగా ఉండటం వల్ల రక్తపోటు నుంచి తప్పించుకోవచ్చు.

2). ఈ పుచ్చకాయలలో ఫైబర్ బాగా ఉండడం వల్ల శరీరంలోని జీర్ణ వ్యవస్థ చాలా మెరుగుపడుతుంది. ఇక శరీరంలోని హానికరమైన టాక్సిన్స్ ను ప్రతి రోజు కూడా బయటకు పంపించడానికి బాగా సహాయపడుతుంది. దీంతో మలబద్దకం సమస్య నుండి బయటపడవచ్చు.

3). ఈ వేసవి కాలంలో శరీరంలో ఉండే శక్తి వెంటనే తగ్గిపోతూ ఉంటుంది. అందుచేతనే ప్రతిరోజు ప్రతి ఒక్కరు కూడా ఒక గ్లాసు పుచ్చకాయ జ్యూస్ తాగడం మంచిది.

4). పుచ్చకాయలలో లైకోపిన్ అనే పదార్థం ఎక్కువగా ఉండడం వల్ల ఇది గుండె రక్షణకు చాలా ఉపయోగపడుతుంది. దీనితో గుండెపోటు వచ్చే సమస్యలు కూడా చాలా తక్కువని చెప్పవచ్చు.

5). పుచ్చకాయ బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.

6). పుచ్చకాయ రసం తరచూ తాగడం వల్ల శరీరానికి విటమిన్ ఎ లభిస్తుంది.. దీంతో మనకున్న కంటి సమస్యలు తొలగిపోతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: