వేసవి కాలం రానే వచ్చింది అందుకే దీంతో ప్రతి ఒక్కరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా ఎక్కువ బరువు ఉన్నవారికి ఈ వేడికి అలసట గా అనిపించడం, చెమట ఎక్కువగా వేయడం, విసుగ్గా అనిపించడం వంటివి జరుగుతూనే ఉంటాయి. అయితే ఈ వేసవి కాలంలో ఎలా ఉన్నప్పటికీ కూడా ఆహారం తగినంత తింటూనే ఉండాలని వైద్యులు తెలియజేస్తున్నారు. అయితే ఆహారం ఎక్కువగా తినకుండా ఉండడం వల్ల కొన్నిసార్లు శక్తి తగ్గిపోయే అవకాశాలు ఉంటాయట. అయితే కొన్ని ఆహార పదార్థాలు తినడం వల్ల శక్తిని పెంచడంలో చాలా సహాయపడుతుంది వాటి గురించి చూద్దాం.

1). ఈ వేసవి కాలంలో పుచ్చకాయ తినడానికి చాలా రుచిగా ఉంటుంది. అంతే కాకుండా కడుపు బాగా నిండుతుంది. ఇది శరీరాన్ని డీహైడ్రేట్ కాకుండా చేస్తుంది.

2). ఈ వేసవి కాలంలో ఓట్ మీల్ ను కూడా తినవచ్చు.. ఇందులో పాస్పరస్, విటమిన్-B1, మెగ్నీషియం, ప్రోటీన్లు బాగా పుష్కలంగా లభిస్తాయి. ఇక అంతే కాకుండా ఇవి ఎంతో రుచిగా కూడా ఉంటాయి. వీటిని తియ్యగా లేదా ఉప్పు గా అయినా తీసుకోవచ్చు.

3). పొటాషియం, ఫైబర్ పుష్కలంగా ఉండే పండ్లలో అరటిపండు కూడా ఒకటి. ఇది మనిషికి అలసట కలిగించకుండా ఉంటుంది. వీటిని తినడం వల్ల కడుపు చాలా నిండినట్టుగా ఉండడంతో పాటు.. మంచి జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది.

4). ఈ వేసవి కాలంలో శక్తి తగ్గి పోకుండా ఉండేందుకు గుమ్మడికాయ గింజలు బాగా ఉపయోగపడతాయి. ఈ గుమ్మడికాయ గింజలు వారంలో కనీసం రెండు సార్లు అయినా తింటే ఇందులో ఉండే విటమిన్లు.. ఒమేగా 3, ప్రొటీన్లు పుష్కలంగా లభిస్తాయి. వీటివల్ల కూడా మనకు అలసటగా అనిపించదు.

5). ఈ వేసవి కాలంలో ప్రతి ఒక్కరు తినవలసిన పదార్థం ఏమిటంటే పెరుగు. ఇందులో కార్బోహైడ్రేట్లు, ప్రొటీన్లు చాలా పుష్కలంగా లభిస్తాయి.

ఇవన్నీ తినడం వల్ల ఈ వేసవి తాపం నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: