ప్రస్తుతం ఉన్న బిజీ లైఫ్లో ప్రశాంతంగా నిద్ర పోవడం అనేది ఒక గొప్ప వరం లాంటిదని చెప్పవచ్చు.. కరోనా నేపథ్యంలో అందరి జీవితాలు చాలా తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగులు పోగొట్టుకోవడం మే కాకుండా వారి ప్రశాంతత కూడా కరువైందని చెప్పవచ్చు. ఇక మిగిలిన వారు మాత్రం ఆర్థికంగా కుదేలు అయ్యారని చెప్పవచ్చు. అయితే వీటన్నిటికీ కారణం సగటు మధ్య తరగతి జీవుడు చాలా ఒత్తిళ్లకు గురి కావడమే అని చెప్పవచ్చు. దీని ప్రభావం మన ఆరోగ్యం పై చూపుతుంది. దీంతో మనకు సరిగ్గా నిద్ర రాకుండా ఉండడమే కాకుండా ఏకాగ్రత కూడా లోపిస్తుంది. అయితే హాయిగా నిద్రపోవాలి అనుకునేవారు.. వీటిని పాటిస్తే సరి.

ప్రతి మనిషి ఒక రోజులో కనీసం ఎనిమిది గంటల సేపైనా నిద్ర పోవాలి అది మన శరీరానికి మన ఆరోగ్యానికి మంచిది. కొంతమంది పనిలో పడి నిద్ర ను ఆటంకం కలిగేలా చేస్తూ ఉంటారు. అలా ఎప్పుడు చేయకూడదు. అయితే ఎంతో మందికి కూడా రాత్రులు నిద్ర సరిగ్గా పట్ట కుండా ఉంటుంది. కొందరు బెడ్ పైన కొన్ని గంటల పాటు దొర్లుతూ నే ఉంటారు.. కానీ నిద్ర పోలేక పోతూ ఉంటారు. మరికొందరైతే ఏవేవో ఆలోచనలు చేస్తూ రాత్రి సమయాలలో నిద్రపోకుండా ఉంటారు.

1). గసగసాలు ని బాగా వేయించి పల్చని బట్టలో తీసుకొని.. నిద్రించేటప్పుడు వాటిని వాసన పిలిస్తే నిద్ర బాగా వస్తుంది.

2). ఆముదం లేదా నువ్వుల నూనె ను కాస్త తలకు పట్టించి చేతులతో నెమ్మదిగా మృదువుగా దువ్వుతూ ఉంటే మెల్లగా నిద్రలోకి జారుకుంటారు.

3). ఒకవేళ రాత్రి సమయాలలో కాస్త గోరువెచ్చని పాలు తాగడం వల్ల మంచి నిద్ర వస్తుందట.

4). రాత్రి పడుకునే ముందు ఆవునెయ్యిని కాస్త గోరువెచ్చగా చేసుకుని ముక్కులో రెండు చుక్కలు వేసుకుంటే కచ్చితంగా నిద్ర పట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వైద్యులు తెలపడం జరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: