ఈ వేసవి కాలంలో లభించే పండ్లలో పుచ్చకాయ కూడా ఒకటి. అధికంగా నీరు శాతం ఉండే ఈ పుచ్చకాయను తినడం వల్ల శరీరంలో వేడి శాతం తగ్గడమే కాకుండా ఈ ఎండాకాలం శరీరం డీహైడ్రేట్ కాకుండా ఉంటుంది. అందుకే ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్ లో కచ్చితంగా తినాలని వైద్యులు సైతం సూచిస్తూ ఉంటారు. ముఖ్యంగా పుచ్చకాయ వల్ల శరీరానికి కావలసిన నీరు అందడమే కాకుండా ఎన్నో రకాల పోషకాలు కూడా లభిస్తాయి. ముఖ్యంగా సిట్రులిన్ అనే ముఖ్యమైన అమైనో ఆమ్లం కూడా మనకు పుచ్చకాయ ద్వారా లభిస్తుంది. పుచ్చకాయ చర్మ సౌందర్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది అని చెప్పవచ్చు.

ఇకపోతే పుచ్చకాయలో లభించే సిట్రులైన్ నైట్రిక్ ఆక్సైడ్  6 ను ఉత్పత్తి చేస్తుంది. ఫలితంగా రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. మనకు పుచ్చకాయ లో కేలరీలు తక్కువ పోషకాలు ఎక్కువగా ఉంటాయి. అంతే కాదు చక్కెర పరిమాణం కూడా నియంత్రించబడుతుంది. డైటింగ్ చేస్తున్నారా అలాంటి వారికి ఇది ఒక మంచి ఔషధం అని చెప్పవచ్చు. ఇన్ని ప్రయోజనాలు ఉన్న పుచ్చకాయలను ఎట్టి పరిస్థితుల్లో కూడా రిఫ్రిజిరేటర్లో ఉంచరాదు.  ఇలా ఉంచడం వల్ల పుచ్చకాయలో ఉండే పోషక విలువలు మొత్తం తగ్గుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కాబట్టి సాధ్యమైనంతవరకు పుచ్చకాయను  బయట వాతావరణంలోనే ఉంచడం మంచిది.


వేడి వాతావరణంలో రిఫ్రిజిరేటర్ లో ఉంచిన పుచ్చకాయ ముక్కలను తింటే మంచి అనుభూతి కలుగుతుంది. కానీ పూర్తి పోషకాహారం ఉండాలంటే మాత్రం ఖచ్చితంగా పుచ్చకాయను బయట వాతావరణంలో మాత్రమే ఉంచాలి. పుచ్చకాయను రిఫ్రిజిరేటర్ లో కంటే గది ఉష్ణోగ్రత వద్ద ఉంచి తినడం వల్ల పుచ్చకాయ నుంచి లభించే అన్ని పోషకాలు కూడా మనకు లభిస్తాయి. చల్లగా పుచ్చకాయలు తినాలని అనుకున్నట్లయితే మిల్క్ షేక్ లేదా స్మూతీ లాగా తయారు చేసుకొని తాగవచ్చు. ఇన్ని ప్రయోజనాలు లభించే  పుచ్చకాయ మీరు గది ఉష్ణోగ్రత వద్ద మాత్రమే ఉంచి తినడం వల్ల వేసవి కాలంలో వేడి తాపం నుండి బయటపడవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: