సాధారణంగా ఒక్కో నెలలో పుట్టిన వారు ఒక్కో రకంగా వ్యవహరిస్తుంటారు. కాగా మనం ఇప్పుడు ఏప్రిల్ నెలలో పుట్టిన వారు ఎలా ఉంటారు, వారి గుణగణాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.

ఏప్రిల్ నెలలో పుట్టిన వారు అందరితో స్నేహంగా ఎప్పుడూ చిరునవ్వుతో కనిపిస్తూ, అలాగే వారు ఏ రంగులో ఉన్నా ఆకర్షణీయమైన చూపుతో నమ్మకానికి మారు పేరులా ఉంటూ..ఎదుటి వారి నుండి కూడా అదే ఆశిస్తుంటారు. అలాగే జీవితంలో ఏ సంబంధంలో నైనా సరే చాలా జాగ్రత్తగా ఉంటారు. అంతేకాదు ఈ నెలలో పుట్టిన వారు చాలా స్వతంత్ర భావాలు కలిగి ఉండటమే కాకుండా, వారి పనులు వారే స్వయంగా వారి ఆలోచనలకు అనుగుణంగానే చేసుకుంటారే తప్ప ఇతరుల జోక్యాన్ని అసలు ఇష్టపడరు. మరీ అవసరం అయితే పని నుంచి తప్పుకుంటారు, అంతేకానీ ఇతరులు చెబితే ఏ మాత్రం వినరు.

ఏప్రిల్ లో పుట్టిన వారు చాలా శక్తివంతులు, అలాగే తెలివితేటలు కూడా మెండుగా కలిగి , చాలా యాక్టివ్ గా ఉంటారు. అంతేకాదు వారికి కొంచెం కోపం ఎక్కువైనప్పటికీ అది ఇతరుల మంచి కోసమే ప్రదర్శిస్తారు .. అలాగే వేరే వారికి మార్గదర్శకత్వంగా కూడా ఉంటారు. కాకపోతే వీరికి మానసిక ధైర్యం చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే వారు ఎప్పటికప్పుడు ప్రణాళికలు వేసుకుని మరి తమ పనులు పూర్తి చేసుకుంటారు. అలాగే వారు తలపెట్టిన పనిని మధ్యలో వదిలేయకుండా ఎన్ని ఇబ్బందులు వచ్చినా పూర్తిచేసి చూపిస్తారు. ప్రతి విషయంలోను ముక్కుసూటిగా, నిజాయితీగా ఉంటారు. దీని కారణంగా చాలా మందికి శత్రువుగా మారినా కూడా తమ తీరుని మాత్రం మార్చుకోరు. అలాగే ఇంట్లోను, కార్యాలయంలోను, అలాగే వారి వ్యక్తిగత జీవితంలోనూ మంచి స్థానంలో ఉండాలని ఆశపడతారు..దానికి  తగిన ప్రయత్నం చేస్తారు.

జీవితంలో అభివృద్ధి చెంది తమ ఆశలు నెరవేర్చుకుని తృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు. దాంపత్య జీవితంలో ఎలాంటి సమస్యలు, ఇబ్బందులు లేకుండా  పరస్పర అవగాహన ఉంటుంది. అంతేకాదు  వారికి అదృష్టంతో పాటూ పరిస్థితులు కూడా అనుకులిస్తూ, సోమరితనం లేకుండా పనే దేవుడిగా భావిస్తారు. అయితే ఈ నెలలో పుట్టిన వారికి సహజంగా కంటి, పంటి, చెవి సమస్యలు అలాగే జ్వరం, తలపోటు ఎక్కువగా బాధిస్తుంటాయి. వీరికి అనుకోని ధననష్టం కలిగినా జీవితంలో తట్టుకుని నిలబడతారు. అంతేకాక వీరికి సోమవారం, శుక్రవారం అదృష్టాన్నిస్తాయి అలాగే మంగళవారం, గురువారం కలిసొస్తుంది. పింక్ కలర్ వీరికి కలిసొచ్చే రంగు.

మరింత సమాచారం తెలుసుకోండి: