వేసవికాలం అంటేనే మామిడి పండ్లకు పెట్టింది పేరుగా ప్రతి ఒక్కరు చెబుతూ ఉంటారు. ముఖ్యంగా వేసవికాలంలోనే లభించే ఈ మధురమైన పండ్ల ను తినడానికి ఎవరు మాత్రం ఇష్టపడరు. అందుకే తప్పకుండా మామిడిపండు తింటూ ఉంటారు. ముఖ్యంగా మామిడి పండ్ల వల్ల మనకు ఎన్నో రకాల పోషకాలు లభిస్తాయి అన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే మామిడి పండ్లు తిన్న తర్వాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు. ఇక మామిడిపండ్లలో లభించే పోషకాల విషయానికి వస్తే.. విటమిన్ ఏ తో పాటు విటమిన్ సి కూడా అధికంగా లభిస్తుంది. ముఖ్యంగా ఇవి మన శరీరానికి ఎంతో శక్తి కలిగేలా ఉపయోగపడతాయి.

ఇక మామిడిపండ్లలో పొటాషియంతో పాటు ఫైబర్ కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి జీర్ణ సంబంధిత సమస్యలతో పాటు మలబద్ధకం కూడా దూరం అవుతుంది. ఇక మామిడి పండ్లను తింటే చాలా లాభాలు ఉన్నాయి. అయితే తిన్న తర్వాత మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు చెబుతున్నారు.. లేకపోతే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందట. ఇక మామిడి పండ్లు తిన్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా పెరుగు అన్నం తినకూడదని లేదా పెరుగన్నంలో కలుపుకొని తినకూడదు అని వైద్యులు చెబుతున్నారు . ఎందుకంటే పెరుగన్నం లో మామిడి పండ్లు కలుపుకొని తినడం వల్ల కడుపునొప్పి,  గ్యాస్,  కడుపులో మంట, కడుపు ఉబ్బరం లాంటి ఎన్నో సమస్యలు తలెత్తుతాయి.

పండ్లు తిన్న తర్వాత చేదు పదార్థాలను కూడా తినకూడదు . ఇలా తినడం వల్ల కడుపులో వికారం, వాంతులు , విరోచనాలయ్యే అవకాశం కూడా ఉంటుంది. ఇక మామిడి పండ్లను ముక్కలుగా చేసి అందులో పాలు,  చక్కెర వేసి జ్యూస్ లాగా తాగుతూ ఉంటారు .అలా అస్సలు చేయకూడదు. ముఖ్యంగా మామిడి పండ్లలో సహజంగా చక్కర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. మళ్ళీ చక్కర యాడ్ చేయడం వల్ల షుగర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మామిడి పండ్లు తిన్న తర్వాత ఇలాంటి జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: