ఇప్పుడున్న జీవనవిధానం వల్ల,చాలామంది  మధుమేహంతో బాధపపడుతున్నారు.ఈ మధుమేహంతో  బాధపడేవారు తీసుకునే ఆహారం అనేది కీలకమైన పాత్ర పోషిస్తుంది. అలాంటి వారు,వారి ఆహార అలవాట్లలో కొన్ని మార్పుల్ని చేసుకోవాలి.అప్పుడే వారి ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.అయితే మధుమేహ బాధితులు జీవితాంతం మందులు వాడాలి. అలా మందులు వాడుతూ కొన్ని చిట్కాలను కూడా పాటిస్తే డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది.

ఈ మధుమేహం అదుపులో ఉండడానికి తమలపాకుతో  ఒక డ్రింక్ తయారుచేసుకోవాలి. అందుకు తమలపాకు, నల్ల జీలకర్ర కావాలి.ఒక కప్పు నీటిని తీసుకొని అందులో ఒక తమలపాకు ముక్కలుగా  చేసుకుని, దానికి తోడు అర టీ స్పూన్ నల్ల జీలకర్ర వేసి దానిని నైట్ అంతా అలాగే ఉంచాలి. మరుసటి రోజు ఉదయాన్నే పరగడుపున ఆ నీటిని తాగాలి.ఇలా రోజూ తీసుకున్నట్లయితే డయాభేటీస్ కంట్రోల్లో ఉంచడమే కాకుండా, అనేక రకాల ఆరోగ్య సమస్యలకు కూడా ఉపశమనం కలిగిస్తుంది. కొంతమందికి మధుమేహం వల్ల వచ్చే కొన్ని సైడ్ఎఫెక్ట్స్ తగ్గించడానికి ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇందులో వాడిన తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది షుగర్ లెవెల్స్ ను కంట్రోల్ చేయడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ కూడా తగ్గిస్తుంది.

ఇందులో వాడే నల్లజీలకర్రకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాముఖ్యత ఉన్నది. దీనికి రక్తంలో గ్లూకోజ్ లెవెల్ నీ క్రమంబద్దికరించే గుణం ఉంటుంది.ఈ నల్ల జీలకర్ర డ్రింక్ ను సేవించినట్లయితే షుగర్ లెవెల్స్ ను కంట్రోల్లో ఉంచుతుంది. దీనితో పాటు మధుమేహంతో బాధపడేవారు రోజూ 45 నిమిషాలు పాటు వ్యాయామం,వాకింగ్ లాంటివి చేస్తూ ఉండాలి. అలాగే సరైనా సమయంలో మంచి ఆహారాన్ని తీసుకుంటూ ఉండాలి. ఈ మధుమేహం బాధితులు ఈ వ్యాధిని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.ఇలా చేసినట్లయితే మెదడు, కిడ్నీ, కళ్ళు, గుండె లాంటి వాటిపై ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి  అలాంటి వారు మందులను వాడుతూ ఈ కాషాయంను తయారు చేసుకుని తాగినట్లయితే మంచి ఉపశమనం కలుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: