మాములుగా ఉదారంగు టమాటాలు ప్రాచుర్యంలోకి ఇంకా రాలేదు. ఇప్పుడిప్పుడే ఊదా టమాటా బీడ్ కు అమెరికా ఆమోధించింది. వచ్చే సంవత్సరం నుండి ఈ బీడ్ ని అమెరికాలో పండించుకోవచ్చని ఆ దేశ అగ్రికల్చర్ ఆధారిటీ ఉత్తర్వులు జారీచేసింది .క్యాన్సర్ తొలగించే ఔషధ గుణాలు కలిగిన ఈ టమాటా పై ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా చర్చ సాగుతోంది.


ఇది యూరోపియన్‌ శాస్త్రవేత్తలు డ్రాగన్ ఫ్రూట్, డ్రాగన్ పూల జీన్స్‌ ను టమాటాలోకి ఇంజెక్ట్ చేసి ఊదా టమాటాలు వచ్చేలా సృష్టించారు. అయితే ఇందులో ఎటువంటి రుచి, వాసన ఉండదు. వీటిలో క్యాన్సర్‌ వ్యాధిని, హృద్రోగాలను నిరోధించే ఆంతోసయానిన్‌ అనే పదార్థం, ఇతరత్రా బయో యాక్టివ్ వంటి గుణాలు  ఉంటాయి. ఈ టమాటాలు చూడగానే వంకాయల్లా ఉదా రంగుల్లో కనిపిస్తాయి.ఈ జన్యుమార్పిడి పంటను వారి దేశంలో పండించడానికి అనుమతించింది.14 సంవత్సరాలనుండి చివరికి అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

ఎలుకలపై ప్రయోగాలు..
ప్రయోగాల్లో భాగంగా క్యాన్సర్ సోకిన ఎలుకలకు ఊదా టొమాటోలు ఇచ్చి పరిశోదించారు. దీంతో వాటీ ఆయుష్షు గణనీయంగా పెరిగింది. సాధారణ టొమాటోలు తిన్న క్యాన్సర్ బాధిత ఎలుకల కంటే,ఊదా టొమాటోలు తిన్న క్యాన్సర్ బాధిత ఎలుకలు క్యాన్సర్ నుండి తొందరగా కోలుకున్నాయి. బ్రిటన్ కు చెందిన Norfolk Plant Sciences అనే కంపెనీ ఊదా టొమాటోల విత్తనాల అభివృద్ధి కి సంబంధించిన దరఖాస్తును 2021 లో అప్లై చేసింది. నిజానికి 2009 నుంచే ఆ కంపెనీలో ఊదా టొమాటోలపై రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వర్క్ జరుగుతోంది. ఇంకా ఊదా టొమాటోలకు బ్రిటన్ లో అనుమతి రాలేదు. కానీ అమెరికా పచ్చజెండా ఊపేసింది. వచ్చే ఏడాది నుంచి అమెరికా సూపర్ మార్కెట్ లో దొరకబోతున్నాయి. ఇకపై  క్యాన్సర్ మహమ్మారికి చెక్ పెట్టబోతున్నాయి.ఇక ఈ బ్రౌన్ టమోటాలు చూడడానికి మరి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. అతి త్వరలోనే ఇండియన్ మార్కెట్లో కూడా వీటిని చూడబోతున్నామని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: