చాలా మంది సన్నగా ఉంటారు. అలాంటి వారు బరువు పెరిగి బాగా ఫిట్ గా వుండాలనుకుంటే వారు రాత్రి భోజనంలో ఒక చిప్ప పచ్చి కొబ్బరి ముక్కలను నానబెట్టిన బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా పప్పు, పుచ్చ గింజల పప్పును ఆహారంగా తీసుకోవాలి. ఇంకా అలాగే వీటితో పాటు 10 ఎండు ఖర్జూరాలను ఇంకా తాజా పండ్లను కూడా రాత్రి భోజనంలో ఆహారంగా తీసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఖచ్చితంగా ఆరోగ్యంగా బరువు పెరగవచ్చు. బరువు పెరగాలంటే ముందు ఆకలి బాగా అవ్వాలి. ఆకలి అవ్వాలంటే మల విసర్జన రోజుకు రెండు సార్లు ఖచ్చితంగా సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఈ విధమైన ఆహారాలను తీసుకుంటూ చక్కటి జీవనశైలిని పాటించడం వల్ల నెలకు రెండు నుండి మూడు కిలోల బరువు ఆరోగ్యవంతంగా పెరుగుతారని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.బరువు పెరగాలనుకునే వారు ఉదయం పూట దోసెడు మొలకెత్తిన విత్తనాలతో పాటు రాత్రంతా నానబెట్టిన 2 గుప్పిల పల్లీలను ఆహారంగా తీసుకోవాలి.


చికెన్, మటన్ లో కంటే పల్లీలలో 5 రెట్లు క్యాలరీలు అధికంగా ఉంటాయి. అలాగే 10 ఖర్జూర పండ్లను కూడా తీసుకోవాలి. అలాగే మనకు నచ్చిన ఏదో ఒక పండును కూడా ఆహారంగా తీసుకోవాలి. ఖర్జూర పండ్లు, పల్లీలు, మొలకెత్తిన గింజలు శరీరం కండ పట్టడంలో బాగా సహాయపడతాయి. వీటిని ఉదయం 9 గంటల లోపే ఆహారంగా తీసుకోవాలి. అలాగే మధ్యాహ్నం భోజనంలో ముడి బియ్యంతో వండిన అన్నాన్ని తీసుకోవాలి. 70 శాతాన్ని అన్నం 30 శాతం కూరలను తీసుకోవాలి. ఆకు కూరలతో చేసినపప్పు కూరలను ఎక్కువగా తీసుకోవాలి.అయితే చాలా మంది కూడా బరువు పెరగాలని  జంక్ ఫుడ్ ను చాలా ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల శరీరంలో కొవ్వు పేరుకుపోయి మరిన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. కనుక మనం ఆరోగ్యవంతంగా బరువు పెరగడం చాలా అవసరం.

మరింత సమాచారం తెలుసుకోండి: