అరటి చెట్టులో చాలా రకాల ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. ఎందుకంటే అరటి చెట్టులోని ప్రతీ భాగం ఆరోగ్యానికి ఉపయోగపడేదే. అరటి పండు తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఎలాంటి అనారోగ్య సమస్యల రాకుండా ఉంటాయి.అలాగే అరటి కాండంతో కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు చాలా పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో కూడా ఈ అరటి కాండాన్ని ఔషధంగా వాడుతూ ఉంటారు. ఎన్నో వ్యాధులను నయం చేసేందుకు అరటి కాండం తింటే మనకు చాలా మంచిది. ఎందుకంటే ఇందులో ఫైబర్ శాతం మెండుగా ఉంటుంది. ముఖ్యంగా ప్రేగుల్లో పేరుకునిపోయిన వ్యర్థాలను ఇంకా మలినాలను ఇది ఈజీగా బయటకు పంపుతుంది. అరటి కాండం తింటే ఎన్ని ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.


నెలసరి సమయంలో మహిళలు ఖచ్చితంగా చాలా సమస్యల్ని ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారికిఅరటి కాండంతో చాలా మంచి పరిష్కారాలు దొరుకుతాయి.అరటి కాండం రసం లేదా అరటి పువ్వు రసాన్ని ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే అరటి రసంలో ఆస్ట్రింజెంట్ ఉంది.అయితే దీన్ని నేరుగా తాగలేని వారు బెల్లం  కలుపుకుని తాగితే మంచి రిజల్ట్ ఉంటుంది.మనకు కాలిన గాయాలు ఎక్కువ కాలం తగ్గవు. అలాంటి వారు ఆ అరటి కాడను కాల్చి.. బుడితను కొబ్బరి నూనెతో కలిపి రాస్తే ఎటువంటి కాలిన గాయాలైనా చాలా త్వరగా నయం అవుతాయి. ఇంకా అలాగే కామెర్లు ఉన్నవారు.. అరటి కాండాన్ని ఎండలో బాగా ఆర బెట్టి పొడిలాగా చేసుకోవాలి. ఈ పొడిలో ప్రతి రోజూ ఖచ్చితంగా తేనె కలిపి తీసుకోవాలి.


ఇక ఇలా చేస్తే తక్కువ సమయంలోనే కామెర్లు తగ్గిపోతాయి.ఇంకా అలాగే బ్లడ్ ఇన్ ఫెక్షన్ వంటి సమస్యలతో బాధ పడేవారు అరటి కాండం సూప్ తాగితే.. రక్తం చాలా ఈజీగా శుద్ధి అవుతుంది. ఇక దాహం అతిగా వేసేవారు కూడా అరటి కాండం చూర్ణం లేదా రసం తాగితే ఖచ్చితంగా చాలా మంచి ఫలితం ఉంటుంది.అరటి కాండం తినడం వల్ల నరాల సమస్యలు అదుపులోకి వస్తాయి. నరాల సమస్యలతో బాధ పడే వారు అరటి కాండం రసాన్ని తరచూ తాగాలి. ఇలా తాగితే నరాల సమస్యలు అదుపు అవుతాయి. అదే విధంగా పొడి దగ్గుతో ఇబ్బంది పడేవారు కూడా అరటి కాండం రసం తాగితే చాలా చాలా బాగా పని చేస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: