ప్రజెంట్ ఉన్న యూత్ తమ ముఖ సౌందర్యాన్ని పెంచుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకోసం బ్యూటీ పార్లర్ కి లక్షలు లక్షలు పోసి ట్రీట్మెంట్లు కూడా తీసుకుంటున్నారు. కానీ కొందరికి వీటి ద్వారా ఎటువంటి ఫలితాలు రావడం లేదు. దానికి తోడు డబ్బు కూడా వృధా అవుతుంది. నిజానికి న్యాచురల్ గా సంపాదించుకున్న అందం ఎప్పటికీ చెరిగిపోదు. అదే బ్యూటీ పార్లర్ తో వచ్చిన అందం రెండు మూడు రోజుల్లో పోతుంది. అదే నేచురల్ పద్ధతిలో అందమైన ముఖ సౌందర్యాన్ని సొంతం చేసుకుంటే మీ లైఫ్ లాంగ్ ఉంటుంది.

అలా బ్యూటీ పార్లర్ కి వెళ్ళకుండానే కొన్ని చిట్కాలతో మీ ముఖ సౌందర్యాన్ని మరింత పెంచుకోవచ్చు. మీ ముఖం వేగంగా తెల్లబడాలంటే టమాటా రసాన్ని మొఖానికి రాసుకుంటే చర్మం పై పేర్కొన్నటువంటి మురికి తొలగిపోయి ముఖం తెల్లగా మారుతుంది. అదేవిధంగా సెనగపిండి లో పెరుగు కలిపి ముఖానికి రాసుకున్న మీ చర్మం కాంతివంతంగా మారడమే కాకుండా తెల్లగా కూడా వస్తుంది. అలోవెరా జెల్ మీ ముఖానికి పట్టించినట్లు అయితే మీ ఫేస్ పైన ఉన్నటువంటి మచ్చలు తొలగిపోయి మీ ఫేస్ కాంతివంతంగా మారేందుకు సహాయపడుతుంది.

అదేవిధంగా పచ్చి పాలను ఫ్రిజ్లో పెట్టి అందులో కాటన్ బాల్ వేసి మీ ముఖంపై సున్నితంగా రుద్దుకుని కాసేపు వదిలి వేసినట్లయితే మీ ముఖం తెల్లగా అండ్ మృదువుగా మారుతుంది. మీ ముఖం తెల్లగా మారాలంటే మీ ఫేస్ పై ఉన్న టాన్ ని  తొలగించుకోవాల్సి ఉంటుంది.  ఇందుకోసం ముల్తాని మట్టిని ముఖానికి అప్లై చేయడం ద్వారా టాన్ పోతుంది. ముల్తానీ మట్టిలో చాలా బెనిఫిట్స్ దాగి ఉంటాయి. ఈ మట్టిని వారానికి రెండు రోజులు మీ ముఖానికి అప్లై చేయడం ద్వారా మురికి వంటి వి పోయి హెల్దీ స్కిన్ మీ సొంతం అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సింపుల్ చిట్కాలని పాటించి గ్లోయి స్కిన్ ని మీ సొంతం చేసుకోండి.

మరింత సమాచారం తెలుసుకోండి: