సాధారణంగా మన దేశంలో రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు.. మరి అమెరికాలో రోజుకి ఎన్ని గంటలు ఉంటాయి? అక్కడ 24 గంటలే.. మరి భారత పొరుగు దేశమైన పాకిస్తాన్లో? అక్కడ కూడా 24 గంటలే.. అక్కడ ఇక్కడ కాదు ప్రపంచంలోనే ఏ దేశంలో అయినా రోజుకి 24 గంటలే ఉంటాయి. అయినా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావ్ బాసు ఇదంతా అంటారా.. రోజుకి 24 గంటలు కాదు 25 గంటలు ఉంటాయి అంటే నమ్ముతారా.. ఊరుకోండి వాసు జోక్ చేస్తే నవ్వేటట్టు ఉండాలి అంటారు ఎవరైనా.. కానీ జోక్ కాదు ఇది నిజమే అవ్వబోతుంది రానున్న కాలంలో. ఎందుకంటే ప్రస్తుతం రోజుకి 24 గంటలు ఉండగా మరికొన్ని సంవత్సరాలలో రోజుకి 25 గంటలు కాబోతున్నాయి.


 ఇది నమ్మడానికి ఆశ్చర్యంగా ఉన్న వినడానికి ఎంతో వింతగా అనిపిస్తున్న.. మరి కొన్ని సంవత్సరాల్లో ఇది నిజం కాబోతుంది అన్నది ఎవరో చెప్పడం కాదు శాస్త్రవేత్తలు చెబుతున్న మాట. వాతావరణంలో సంభవిస్తున్న వేగవంతమైన మార్పులు భూమి వేగంలో మందగమనం కారణంగా భూ పరిభ్రమణకు మరింత సమయం పడుతుందట. తద్వారా ఇప్పుడు రోజుకి 24 గంటలుగా ఉన్న సమయం కాస్త 25 గంటలుగా మారబోతుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటో తెలుసా 14 లక్షల సంవత్సరాల క్రితం భూమిపై రోజుకి 18.4 ఒకటి గంటలే ఉన్నాయట.


 ఇక ఆ తర్వాత కాలంలో అటు వాతావరణం లో మార్పులు భూమి వేగంలో మందగమనం కారణంగా క్రమక్రమంగా ఒక రోజులో ఉండే గంటల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుందట. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో కూడా రోజుకి 24 గంటలుగా ఉన్న సమయం ఇక రానున్న కాలంలో  25 గంటలుగా మారుతుందట. వాతావరణ మార్పుల కారణంగానే భూమి తిరిగే వేగంలో మార్పులు చోటు చేసుకుంటున్నాయ్ అని శాస్త్రవేత్తలు గుర్తించారట. ఇలా వేగం మందగించడం కారణంగానే సూర్యుడు చుట్టూ భూమి తిరిగే సమయానికి మరో గంట అదనంగా సమయం పట్టే అవకాశం ఉందని ఇలా రోజుకి 24 గంటలు కాదు.. 25 గంటలు అయ్యే సమయం దగ్గర్లోనే ఉంది అంటూ మ్యూనిచ్ లోని టెక్నికల్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. అయితే ఇది ఒకటో రెండో సంవత్సరంలో జరిగే పని కాదు. గతంలో 14 లక్షల సంవత్సరాల క్రితం 18.41 గంటలు ఉండేవి. ఈ లెక్కన చూసుకుంటే 20 కోట్ల సంవత్సరాల లో ఈ భూమిపై రోజుకి 25 గంటలు ఉండే అవకాశం ఉందన్నది శాస్త్రవేత్తలు అంచనా.

మరింత సమాచారం తెలుసుకోండి:

Day