ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో 1 పచ్చి వెల్లుల్లి తినటం వల్ల ఎన్నో లాభాలు ఉంటాయట. వెల్లుల్లిలో అల్లిసిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జ్వరం, జలుబుతో బాధపడేవారు ఇలా రోజు ఉదయం ఓ వెల్లుల్లి తింటే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. అల్లిసిన్ రక్త ప్రవాహంలో రక్తప్రసరణను మెరుగు పరుస్తుంది. దీనివల్ల అధిక రక్తపోటు సమస్య ఉండదు. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. శరీరంలోని చెడు కొలెస్ట్రాలను తగ్గించటంలో వెల్లుల్లికి మించిన ప్రత్యామ్నయం మరొకటి లేదు. పైగా మంచి కొలెస్ట్రాలను పెంచుతుంది. వెల్లుల్లి శరీరంలో పేరుకుపోయిన కాలుష్య కారాకాలను తొలగించటంలో కూడా ప్రభావవంతంగా పనిచేస్తుంది.
వెల్లుల్లి నిర్విషికరణలో కూడా సహాయపడుతుంది. సహకరిస్తుంది. దీనిని క్రమం తప్పకుండా తీసుకోవటం వల్ల కడుపు ఉబ్బరం, పెద్ద ప్రేగు శోథ, అల్సర్ వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. పెళ్లిలో విటమిన్ సి, విటమిన్ బి6, మాంగనీస్ అధికంగా ఉంటాయి. కాబట్టి ఎముకల క్షిణతను నివారించే శక్తి దీనికి ఉంటుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్ మరియు యాంటీ బ్యాక్టిరియల్ గుణాలు చర్మకాంతిని పెంచుతాయి. కాబట్టి డైలీ ఉదయం ఈ వెల్లుల్లిని తప్పకుండా తీసుకోండి. ఏ సమస్య ఉన్నా కానీ వెంటనే తగ్గుతుంది ఈ వెల్లుల్లిని తినడం వల్ల. డైలీ మానకుండా తింటే ఏ సమస్య ఉన్నా గానీ తగ్గిపోతుంది.