ఇందులో విటమిన్లు, కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. నెయ్యితో చర్మానికి మసాజ్ చేస్తే చర్మం మాయిశ్చరైజ్ కావటమే కాకుండా కొలాజైన్ ఉత్పత్తి పెరుగుతుంది. చర్మానికి మసాజ్ చేయడం కోసం స్వచ్ఛమైన నెయ్యిని ఎంచుకోవాలి. మనం తయారు చేసిన నెయ్యిని వాడటం చాలా మంచిది. మసాజ్ కు ముందు చర్మాన్ని మురికి లేకుండా శుభ్రం చేసుకోవాలి. స్వచ్ఛన నెయ్యిని కొద్దిగా తీసుకుని వేడి చేయాలి. చేతి వేళ్ళతో కొద్దిగా నెయ్యి తీసుకుని ముఖానికి పట్టించాలి. వృత్తాకారంలో సునీతంగా మసాజ్ చేయాలి. ఇది కులాజైన్ ఉత్పత్తిని ప్రోత్సాహిస్తుంది .
కళ్లు , పెదవుల చుట్టూ , ముడతలు ఉన్న ప్రాంతాలలో సునీతంగా డీప్ గా మసాజ్ చేయాలి . ఇదే మసాజ్ ను చేతులు, కాళ్ల తో పాటు శరీరం అంతా చేసుకోవచ్చు . కోల్లాజెన్ ఉత్పత్తి పెరగాలంటే వృత్తాకారంగా, పైకి, కిందకు స్ట్రోక్స్ ఇస్తూ మసాజ్ చేయాలి . శరీరానికి నెయ్యతో మసాజ్ చేసిన తరువాత సుమారు 30 నుండి 60 నిమిషాలు వరకు దాన్ని అలాగే వదిలేసి ఆ తరువాత శుభ్రం చేసుకోవాలి. ఇది మంచి ఫలితం ఇస్తుంది . కాబట్టి మీరు కూడా నెయ్యను ముఖానికి మసాజ్ చేసుకుంటే మంచిది . మీరు యవ్వనం అందంగా కనిపిస్తూ ఉంటారు. కాబట్టి నెయ్యను డైలీ అప్లై చేసుకోండి .