ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల చర్మం పైన ఉండేటువంటి చిన్న చిన్న మచ్చలు సైతం తొలగిపోతాయి. అంతేకాకుండా ఉప్పులో ఉండే ఖనిజాలు చర్మాన్ని ఉత్తేజవంతంగా మెరిసేలా చేస్తాయి. ముఖం పైన ముడతలు తగ్గించేలా సహాయపడుతుంది. వీటితో పాటు చర్మం మరింత మృదువుగా కూడా మారి చాలా యవ్వనంగా కనిపిస్తారట. కీళ్ల నొప్పులతో ఇబ్బంది పడేవారు కాస్త ఉప్పునీటిని కలిపిన నీటినీ పోసుకోవడం వల్ల వీటి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఉప్పు కలిపిన నీటితో శరీరాన్ని సైతం నెమ్మదిగా మర్దన చేసినట్లు అయితే రక్తప్రసరణ కూడా సులువుగా జరుగుతుంది.
మానసిక ఆరోగ్యం, భౌతిక ఆరోగ్యంతో పాటు పలు రకాల లాభాలు ఉన్నాయట. ముఖ్యంగా ఎవరైనా ప్రశాంతంగా నిద్రపోవాలి అనుకునేవారు ఉప్పు నీటితో కాస్త స్నానం చేయడం వల్ల సుఖ నిద్ర పడుతుందంట. అయితే తల స్నానం మటుకు చేయకూడదు. ఉప్పులో ఉండే లవణాలు ఆమ్లత్వం వల్ల ఎసిడిటీ వంటి సమస్యను కూడా తగ్గించడానికి ఉపయోగపడుతుంది. అలాగే పాదాల కండరాలకు సైతం బలం చేకూర్చేలా ఒత్తిడికి గురి కాకుండా చేస్తుందట. అంతేకాకుండా ఉప్పు నీటిని అప్పుడప్పుడు పాదాల మీద పోసుకున్నట్లు అయితే కండరాలు బలంగా మారుతాయి.
ఉప్పు నీటితో స్నానం చేయడం వల్ల పాదాలు చేతివేళ్ల మధ్యలో ఉండేటువంటి మురికి కూడా తొలగిస్తుందట. ఉప్పులో గుండె లవణాలు శరీరం పైన తేమను పారిపోకుండా చేస్తాయి.