ప్రపంచంలో చాలా రకాల వింతలు ఉంటాయి. ఏదో ఒక మూలన... వివిధ సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఎక్కడ ఏం జరిగినా ప్రపంచ ప్రజలకు కచ్చితంగా తెలుస్తుంది. కొంతమందికి త్వరగా తెలిస్తే మరి కొంతమందికి కాస్త లేటుగా తెలవవచ్చు. అయితే అడవుల తల్లి ఆదిలాబాద్ జిల్లాలో... చాలా రకాల ప్రకృతి వనాలు ఉన్నాయి. వాటర్ ఫాల్స్ అలాగే... ప్రకృతికి సంబంధించిన.. వనరులు మనకు స్పష్టంగా కనిపిస్తాయి.

 

అయితే అలాంటి అడవుల జిల్లా ఆదిలాబాద్ లో... అందరూ కవల పిల్లలే. ఎవరి ముఖం చూసిన డబల్ ఆక్షన్ లాగే కనిపిస్తోంది.  సినిమాలో డబుల్ యాక్షన్ చూసినట్లుగానే మనకు ఆ గ్రామంలో కనిపిస్తుంది. అవును అదిలాబాద్ జిల్లా తాంసి మండలం... వడ్డాడి గ్రామంలో చాలామంది కవల పిల్లలు ఉన్నారు. ఆ ఊర్లో అడుగుపెడితే చాలు కుప్పలు కుప్పలుగా కవల పిల్లలు కనిపిస్తారు. ప్రస్తుతం ఈ సంఘటన వైరల్ గా మారింది.


అయితే ఈ కవల పిల్లల ముఖాల తో పాటు పేర్లు కూడా దాదాపు... సేమ్ టు సేమ్ ఉంటాయి. విరాట్ - విశాల్, అనిత - వనిత కావ్య - దివ్య, రంజిత్ - రజిత... ఇలా కవల పిల్లలకు  సేమ్ టు సేమ్ ఉండేలా పేర్లు కూడా పెడుతున్నారు. అయితే ఇలా కవల పిల్లలు పుట్టడానికి... ఆ గ్రామ ప్రజలు రకరకాల కారణాలు చెబుతున్నారు. అదంతా భగవంతుడి లీల అని కొంతమంది వడ్డాడి గ్రామస్తులు చెబుతున్నారు.  

 

ముఖ్యంగా తమ గ్రామంలో ఉన్న స్వయంభు... లక్ష్మీనరసింహుడి.. కటాక్షమే అని గ్రామస్తులు చెప్పడం జరిగింది. ఆ గ్రామంలో స్వయంబుగా లక్ష్మీనరసింహస్వామి వెలిశాడట. ఆయన వెలిసిన నుంచి.. ఆ గ్రామంలో కవల పిల్లలు విపరీతంగా పుట్టినట్లు చెబుతున్నారు గ్రామస్తులు. అలాగే ఆ గ్రామంలో పసిడి పంటలు కూడా విపరీతంగా పండుతున్నాయట. అందుకే ఆ గ్రామస్తులు లక్ష్మీనరసింహస్వామిని... తమ గ్రామ దేవుడిగా కొలుస్తారట.

మరింత సమాచారం తెలుసుకోండి: