మంచు కురుస్తున్నప్పుడు డ్రైవింగ్ చేయటం చాలా కష్టం. మంచు లో డ్రైవింగ్ చేయటానికి ఎదర ఏ వెహికల్స్ వస్తున్నా కానీ కనిపించవు. అసలే చలికాలం... ఉదయం పూట బయటి పరిసరాలన్నీ మంచు దుప్పటి కప్పేసినట్లుగా ఉంటాయి. తెల్లవారుజాము 3 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు చాలా ప్రాంతాల్లో మంచు కురుస్తూనే ఉంటుంది. దీనివల్ల నడుచుకుంటూ వెళ్లే వారికైనా, కార్లు, టూవీలర్లు, ఇతర వాహనాలను నడుపుతున్న వారికైనా ఇబ్బందిగా ఉంటుంది.

దూరపు ప్రాంతాలు సరిగ్గా కనబడవు. దీని కారణంగానే తరచూ ఏదో ఒకచోట రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని రోడ్డు భద్రత నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డ్రైవింగ్ చేసేవారు, ముఖ్యంగా మంచు ఎక్కువగా కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ట్రిప్ కు వెళ్లేవారు చాలా జాగ్రత్తగా ఉండాలంటున్నారు నిపుణులు. అందుకోసం ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. మంచు కురుస్తున్నప్పుడు రోడ్లపై కార్లలో లేదా ఇతర వాహనాల్లో వెళ్లేవారు ఓవర్ స్పీడ్ గా అసలు వెళ్ళకూడదు. లిమిటెడ్ స్పీడ్ మెయింటైన్ చెయ్యడం మంచిది. అలాగే సడన్ బ్రేక్ వెయ్యడం వల్ల వాహనం స్కిడ్ అయ్యే అవకాశం ఉంటుంది.

ఇక రన్నింగ్ లో ఉన్నప్పుడు బ్రేకులను గట్టిగా నొక్కడం మరింత ప్రమాదకరం. ఇలా చేస్తే టైర్ లాక్ అయ్యి, రోడ్డుపై మంచు కారణంగా ఉన్న తడి వల్ల టైర్లు జారీ వాహనం కిందపడే అవకాశం ఉంటుంది. కాబట్టి బ్రేకులు జాగ్రత్తగా యూజ్ చేయాలి. సడన్ గా కాకుండా సున్నితంగా వెయ్యాలి. తక్కువ స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు ఇది సాధ్యం అవుతుంది. రోడ్డుపై వెళ్తున్నప్పుడు మంచు కురుస్తుంటే గనుక వెహికల్ స్పీడ్ ను కంట్రోల్ చేయడానికి సందర్భాన్ని బట్టి ఇంజన్ బ్రేకింగ్ కూడా ఉపయోగించాలి అంటున్నారు నిపుణులు. అలాగే ఒకేసారి ఎక్కువ గేర్ లో, టాప్ గేర్ లో వాహనాన్ని నడపవద్దు. దీనివల్ల కంట్రోల్ తప్పి ప్రమాదాలు జరగవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: