బెల్లం అనేది మన సంప్రదాయ ఆహారంలో ఒక ముఖ్యమైన భాగం. పూర్వకాలం నుంచి పెద్దలు "చెక్కెర కన్నా బెల్లం మేలు" అని చెప్పేవారు. ఇది మునుగగన్నె వాడడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉన్నాయి. అయితే దీనిని సరైన విధంగా తీసుకుంటే మాత్రమే మంచిది.జీర్ణశక్తి పెరుగుతుంది. బెల్లం ఆహారం తిన్న తర్వాత తింటే జీర్ణవ్యవస్థను ఉత్తేజితం చేస్తుంది. గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు తగ్గిపోతాయి. కాలేయం వేగంగా పని చేసి టాక్సిన్స్‌ను శరీరం నుంచి తొలగిస్తుంది. బెల్లంలో ఉన్న ఐరన్, ఫాస్ఫరస్, పుటాషియం వంటి ఖనిజాలు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ఇది రక్తహీనత ఉన్నవారికి ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా స్త్రీలు నెలసరి తర్వాత బెల్లం తింటే శక్తి పెరుగుతుంది. బెల్లం లోని యాంటీఆక్సిడెంట్లు మరియు ఖనిజాలు శరీరానికి రోగనిరోధక శక్తిని అందిస్తాయి. జలుబు, దగ్గు, ఛాతిలో శ్లేష్మం పేరుకోవడం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

వాతావరణ మార్పులకు చక్కగా తట్టుకోగల శక్తి ఇస్తుంది. ఉదయం గరం నీటిలో కొద్దిగా బెల్లం వేసుకొని తాగితే, శ్వాసనాళాలు శుభ్రం అవుతాయి. ఆస్తమా, బ్రాంకైటిస్ ఉన్నవారికి ఇది సహాయకారి. బెల్లం సహజమైన శక్తి ఉత్పత్తికర్త. అది నెమ్మదిగా రక్తంలో గ్లూకోజ్‌ను విడుదల చేస్తూ శక్తిని అందిస్తుంది. మద్యం లేదా ఫాస్ట్ ఫుడ్స్ వల్ల అలసటగా ఉన్నవారికి బెల్లం శక్తిని కలుగజేస్తుంది. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వలన చర్మాన్ని శుభ్రంగా ఉంచుతుంది.పై మొటిమలు, బ్లాక్ హెడ్స్ తగ్గుతాయి. బెల్లం వల్ల రక్తపరిశుద్ధి జరగడం వల్ల చర్మం ప్రకాశిస్తుంది. రోజుకు 10–15 గ్రాముల బెల్లం చాలు. అధికంగా తింటే బరువు పెరగడం, బ్లడ్ షుగర్ పెరగడం లాంటి సమస్యలు వస్తాయి.

బెల్లం సహజమైనదే అయినా, ఇది కూడా చక్కెరలో భాగమే కాబట్టి మితంగా తీసుకోవాలి. డయాబెటిస్ ఉన్నవారు వైద్య సూచనల మేరకు మాత్రమే తీసుకోవాలి. మార్కెట్ లో కొన్ని బెల్లాలను రంగులు, రసాయనాలు కలిపి తయారు చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో లేదా నేచురల్ ఆర్గానిక్ బెల్లాన్ని మాత్రమే వాడాలి. ఉదయం ఖాళీ కడుపుతో – గోరువెచ్చని నీటిలో కొద్దిగా బెల్లం వేసుకొని తాగితే శుభ్రత, శక్తి, జీర్ణశక్తి పెరుగుతుంది. భోజనం తర్వాత చిన్న ముక్క – జీర్ణం మెరుగవుతుంది. గోధుమ రొట్టెలో బెల్లం కుదుర్చుకొని తింటే – ఆరోగ్యానికి మేలు, రోజుకు ఒక చిన్న ముక్క బెల్లం తినడం అనేది ఆరోగ్యానికి మేలు చేసే అలవాటు. ఇది శరీరాన్ని శక్తివంతంగా ఉంచే సహజ స్నేహితుడు. అయితే మితంగా, నాణ్యమైనదిగా తీసుకుంటేనే దీని ప్రయోజనాలు పొందవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: