నాన్నే నారాయణుడు. సమయాన్ని సందర్భాన్ని బట్టి తానే దశావదారుడు అవుతాడు.  పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దే క్రమంలో నాన్న  ఎన్నో పాట్లు పడతాడు.  విష్ణుమూర్తి పురాణాల్లో ఎత్తిన దశావతారాలు నాన్న ఎత్తుతాడు.

 

పాకడానికి ప్రయత్నించేటప్పుడు "మత్స్యం" అవుతాడు.. ఆటలాడే సమయానికి "కూర్మం" అవుతాడు..కాస్తా పెరగగానే తల మీద ఎత్తుకొని వేసే చిందుల్లో "వరాహుడు " అవుతాడు. అల్లరి ఎంత చేసిన పైకి మాత్రమే కోపం నటించే "నరసింహుడు " అవుతాడు.

 

తాహతు  తెలియక అడిగే కోర్కెల కోసం తాను తగ్గి వేరే వాళ్ల ముందు చేయ్యి చాచే వెర్రి "వామనుడు " అవుతాడు. వెయ్యి కష్టాలు వచ్చిన అలవోకగా  నరుక్కుంటూ వెళ్ళే"భార్గవుడు " అవుతాడు.

 

జీవిత విలువల నడక నేర్పే "రాముడు " అవుతాడు.జీవన యుద్దపు నడత నేర్పే "కృష్ణుడు.  అందుకే నాన్న  సాక్షాత్తూ నడిచే దైవం.  చివరికి ఏదేమైనా.. నాన్నే నారాయణుడు!!

మరింత సమాచారం తెలుసుకోండి: