ఒకప్పుడు గుండె జబ్బులు 50 ఏళ్లు దాటిన వారికి వచ్చేవి. కానీ విపరీతమైన ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ప్రస్తుతం 30 ఏళ్ల వయసులోనే హృద్రోగాల భారిన పడుతున్నారు. గుండె జబ్బుల ముప్పు నానాటికీ అధికం అవుతోంది. దీంతో గుండె ఆరోగ్యం గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఏటా సెప్టెంబర్ 29న వరల్డ్ హార్ట్ డే జరుపుకొంటున్నాం. 


కొంత మంది జీవనశైలి అలవాట్లు వల్ల హార్ట్ రిస్క్ తప్పడం లేదు. ఎన్నో తీవ్రమైన గుండె జబ్బులకు దారి తీస్తున్నది. గత 15 ఏళ్లలో గుండె పోటు కారణంగా మరణించిన భారతీయుల సంఖ్య 34 శాతం పెరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. నిజానికి హృదయ సంబంధ వ్యాధుల గురించి అవగాహన అందిరికి ఉండాలి.


- ఛాతీలో నొప్పి, అలసట వంటి లక్షణాలు హార్ట్ సమస్యలకు సూచనలు, వీటితో పాటు మరికొన్ని అనూహ్యమైన లక్షణాలు కూడా ఉన్నాయి. వీటి గురించి తెలుసుకున్నట్లైతే గుండె సంబంధిత సమస్యలు రాకుండా ముందు జాగ్రత్త నివారణ చర్యలు తీసుకోవచ్చు...


- గుండె పోటు వచ్చే ముందు మెడ, దవడ, చేతులు, నడుము, పొట్ట భాగాల్లో అసౌకర్యంగా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉంటుంది. 


- పొగ తాగడం, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండటం, ఒబేసిటీ, ఎక్సర్‌సైజ్ చేయకపోవడం, ఆహారం, ఆల్కహాల్ తీసుకోవడం, ఒత్తిడి తదితర కారణాలు గుండె పోటు రావడానికి దోహదం చేస్తున్నాయి. 


- కాళ్ళు చేతులు వాపులకు అనేక కారణాలుంటాయి, బరువు పెరగడం, ప్రెగ్నెన్సీ, హై బ్లడ్ ప్రెజర్ మొదలగునివి, ఇది హార్ట్ ట్రబుల్ కు సంకేతం 


- చాలా మంది, చిగుళ్ళ సమస్యతో బాధపడుతుంటారు, అందుకు కారణం సరైన దంత శుభ్రత లేకపోవడం లేదా క్యావిటీస్ వల్ల జరగుతుంది. దంతాలకు, చిగుళ్ళకు రక్తప్రసరణ సరిగా లేకపోవడం వల్ల హార్ట్ సమస్యల వస్తాయని గుర్తించాలి.


- ప్రస్తుతం చాలా మంది హైబ్లడ్ ప్రెజర్ హార్ట్ సమస్యలకు సూచికగా అభిప్రాయపడుతున్నారు,అందువల్ల హైబ్లడ్ ప్రెజర్ ప్రస్తుతం ఉన్న హృదయ స్థితికి సూచనగా ఉంటుంది!



మరింత సమాచారం తెలుసుకోండి: