ఆరోగ్యమే మహాభాగ్యం అని మన పెద్దలు ఏనాడో చెప్పారు. పాశ్యాత్య ఆహారపు అలవాట్ల మోజులోపడి మనం కొంతకాలం దీనిని పెడచెవిన పెట్టాం. తీరా వాటివల్ల దుష్ఫలితాలు రావడంతో మళ్లీ క్రమంగా పూర్వీకుల ఆహారపు అలవాట్లలో కి మళ్ళుతున్నాం. ఇది ఒక రకంగా శుభపరిణామమే. ఈ క్రమంలోనే చాలామంది ఆరోగ్యమైన ఆహార విధానాలను ప్రత్యేకించి పోషకాహారానికి ప్రాధాన్యతనిస్తున్నారు.
ఆరోగ్యానికి సంబంధించి సంబంధించి మరిన్ని విషయాలు, పలురకాల ఆరోగ్య విధానాలు గురించి తెలుసుకుంటున్నారు. 


అయితే అసలు సమస్య ఇప్పుడే మొదలవుతోంది. ఏది తినాలో, ఏది తినకూడదో ఆరోగ్య విధానాన్ని అనుసరించాలో స్పష్టమైన అవగాహనకు రాలేక చాలామందిలో గంద‌ర‌గోళం నెలకొంటున్న‌ది. అనేక రకాల పోషకాహారాల‌పైన ఇలా అపోహలు కలుగుతున్నాయి. వాటిల్లో మొలకెత్తిన గింజలు ఒకటి. మొలకెత్తిన గింజలు తినడం మంచిదేనా కాదా అని ఇంకా సందేహించేవారు ఉన్నారు. ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం.. రాత్రిపూట నానబెట్టి ఉదయాన్నే మొలకెత్తే వాటి వల్ల ప్రయోజనాలున్నాయా అంటే ఖ‌చ్చితంగా ఉన్నాయని చెప్పవచ్చు. అసలు వాటితో మన పూర్వీకులు కాలం నుంచే వంటకాలు చేస్తుండేవారు అని మనకు తెలిసిందే. 


పెసల గుగ్గిళ్ళు, అలసందల గుగ్గిళ్ళు వంటివి రుచి చూడని తెలుగువారు ఉండరు. ఇప్పటికీ దేవుడికి చేస్తే నైవేద్యాలలో ఇవి తప్పనిసరిగా ఉంటాయి. ప్రస్తుత కాలంలో వాటి రుచులు కొంచెం మారి స‌లాడ్‌లుగా మనకు నోరూరిస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యానికి మంచిదే. అయితే వీటిని ఇలానే గాక‌ మొలకెత్తినవి  తింటే ఆరోగ్యానికి మరిన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఎందుకంటే మొలకెత్తిన గింజలు కేవలం గింజలు మాత్రమే కాదు. మొలకల ఎదుగుదల ప్రక్రియ ఆరంభమ‌వుతున్న‌ దశలో ఇవి ఉంటాయి. కాబట్టి ఇందులో ప్రోటీన్లు, విటమిన్లు, మినరల్స్ వంటి పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. అంతే కాదు ఈ గింజల లోప‌ల మొక్క ఆరోగ్యంగా అవసరమైన ఎంజైమ్‌లు ఉత్పత్తి అవుతాయి. 


కాబట్టి ఎంజైమ్‌లు సమృద్ధిగా ఉన్న ఈ దశలోనే వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.మొలకల్లో ఇంకా పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్క‌లంగా ఉన్నాయి. అంతే కాదు ఇవి తేలికగా జీర్ణం అవుతాయి. వీటిన డైట్ చేసేవారికి బాగా ప‌ని చేస్తాయి. వీటిని సులువుగా ఇంట్లోనే తయారు చేసుకునే ప్రత్యేకమైన బాక్సులు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఇంట్లోనే వీటిని తయారు చేసుకుంటే ఇంకా మంచిది. ఇలా చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటూ మొలకెత్తిన గింజలు తినడం వ‌ల్ల ఆరోగ్యంగా జీవితం కొన‌సాగుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: