నాన్ వెజ్ అనగానే మన అందరికి గుర్తుకు వచ్చేది చికెన్.చికెన్ మనం చాలా విదాలుగా చేసుకుంటాము. రైస్ ఐటమ్స్,కర్రీ, ఫ్రై ఇంకా ఎనో రకాలు చేసుకోవచు.మనం ఇప్పుడు కొరియన్ స్టైల్ చికెన్ ఎలా చేయాలో చూద్దాం.   కొరియన్ స్టైల్ "హనీ బటర్ ఫ్రైడ్ చికెన్" కి కావాల్సిన పధార్ధాలు, తయారు చేసే విదానం ఇప్పుడు మనం చూద్దాం.

"హనీ బటర్ ఫ్రైడ్ చికెన్" కావాల్సిన పధార్ధాలు:

చికెన్-1/2kgకార్న్ఫ్లో

ర్-కొద్దిగమైదా-కొద్దిగగుడ్లు-2

బేకింగ్ పౌడర్-1

టేబుల్ స్పూన్తేన-కొద్దిగసోయా

సాస్-2 టేబుల్

స్పూన్పంచదార-1/4

కప్వెల్లులీ-2

రెబ్బలుఆయిల్-డీప్

ఫ్రై కి సరిపడాఉప్పు-తగినంతమిరియాల

పొడి-కొద్దిగబటర్ (వెన్న)-కొద్దిగకొత్తిమీర-కొద్దిగ

"హనీ బటర్ ఫ్రైడ్ చికెన్"

తయారీ విధానం:

   ముందుగా మనం చికెన్ ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఇలా కట్ చేసిన ముక్కలను సుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి.తరువత దాంట్లో కార్న్ ఫ్లోర్,మైదా,గుడ్లు,ఉప్పు,మిరియాల పొడి, బేకింగ్ పౌడర్ వేసుకోని బాగా కలుపుకోవాలి.ఇలా కలిపిన మిస్రమాన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి.


ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పేట్టుకుని దాంట్లో డీ ఫ్రై కి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైయ్యాక మనం ముందుగా కలిపి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఆయిల్ లో వేసుకోని డీ ఫ్రై చేసుకోవాలి.అవి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. ఒకసారి ఫ్రై అయిన తరువాత చికెన్ ముక్కలను తీసి మళ్ళి వాటిని ఇంకో సారి ఫ్రై చేయాలి.ఇలా ఫ్రై అయిన ముక్కలను తీసి పక్కన పెట్టుకోవాలి.


"సాస్" తయారు చేయు విధానాన్ని మనం ఇప్పుడు చూదాం:

మళ్లీ స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైయ్యాక మనం బటర్ వేసుకోవాలి.వెల్లులి రెబ్బలను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోని బటర్ వేసుకున్న ప్యాన్ లో వేసి కొంచం సేపు వేగనివ్వాలి,వేగిన తరువాత సోయా సాస్ కొద్దిగ,పంచదార వేసి బాగా కలపాలి.తరువాత కొద్దిగ తేనె వేసుకుని మళ్లీ కలుపుకుని తిక్ సాస్ లాగా వచ్చినాక దాంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలను ఈ సాస్ లో వేసి ముక్కలకి పట్టేల బాగా కలుపుకోవాలి. నోరూరించే రుచికరమైన "హనీ బటర్ ఫ్రైడ్ చికెన్" సిద్ధమైంది. ఇప్పుడు దీన్ని ఒక సర్వింగ్ గిన్నెలోకి తీసుకుని కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకోవటమే.


మరింత సమాచారం తెలుసుకోండి: