స‌హ‌జంగా ఉద‌యం లేద‌గానే మంచినీరు సేవించ‌డం వ‌ల్ల అసాధార‌ణ‌మైన ఆరోగ్య ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. మ‌న పూర్వీకులు కూడా ఓ లీటరు నీళ్లు తాగితే ఎంతో ఆరోగ్యంగా ఉంటారని అంటారు. నిజానికి వాహనం నడవాలంటే ఇంధనం ఎంత అవసరమో మనిషి శరీరం పనిచేయటం కోసం మంచి నీరూ అంతే అవసరం. అందునా పరగడుపున నీళ్లు తాగటం మరింత మేలు చేస్తుంది. ఉద‌యం లేవ‌గానే ఒక లీట‌ర్ మంచినీటిని తాగాలి. త‌ర్వాత గంట స‌మ‌యం వ‌ర‌కు ఎలాంటి ఆహారం తీసుకోకూడ‌ద‌ని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. 


అలాగే మనం సాధారణంగా భోజనం చేస్తున్నప్పుడు, లేదా భోజనం అయ్యాక నీరు తాగుతుంటాం కదా. భోజనానికి గంట ముందు గానీ, భోజనం తరువాత గంట సేపటికి గానీ నీరు తాగడం మంచిది. భోజనం తరువాత నీరు తాగడం అంటే విషంతో సమానం. ఉద‌యం ప‌ర‌గ‌డుపున నీళ్లు తాగ‌డం వ‌ల్ల ఎన్నో ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. మరి అవేంటో తెలుసుకుందాం..


- ఉద‌యం లేవ‌గానే ఖాళీ క‌డుపుతో మంచినీళ్ళు తాగ‌డం వ‌ల‌న పెద్ద పేగు శుభ్ర‌ప‌డి మ‌రిన్ని పోష‌కాల‌ను గ్ర‌హిస్తుంది. 


- కొత్త ర‌క్తం త‌యారీకి, కండరాలు బలపడి, చక్కగా పెరిగేందుకు ఉద‌యం లేద‌గానే తగినంత నీరు తాగటం చాలా అవసరం. 


- ప‌ర‌గ‌డుపున‌ తగినంత నీరు తాగేవారి చర్మం సహజంగా, తగినంత తేమతో, మృదువుగా మారుతుంది.


- రోజు ఉద‌యం క‌నీసం అర‌లీట‌రు నీటిని తాగ‌డం వ‌ల‌న 24 శాతం శ‌రీర మెట‌బాలిజాన్ని పెంచుతుంది. దీంతో బ‌రువు త‌గ్గ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది.


- ఉదయం లేచిన వెంటనే మంచినీళ్లు తాగ‌డం మల విసర్జన సులభంగా జరుగుతుంది. మ‌రియు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్ధాలు ఏరోజుకారోజు బయటికి వెళ్లిపోతాయి. 


- ఉదయాన్నే నీరు తాగేవారిలో మూత్ర సంబంధిత ఇన్‌ఫెక్షన్స్ ముప్పు తక్కువ. ఒక‌వేళ‌ వ‌చ్చినా వెంటనే తగ్గుతాయి. అలాగే పరగడుపున నీళ్లు తాగటం వల్ల ఆకలి, జీర్ణశక్తి పెరుగుతాయి.  


మరింత సమాచారం తెలుసుకోండి: