ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఉన్న సమస్యలో అతి పెద్ద సమస్య "హెయిర్ ఫాల్". చాలా మంది ఈ సమస్యతో  బాధపడుతున్నారు. కాలుష్యం వల్ల,టెన్షన్స్ వల్ల,షాంపూస్ వల్ల ఇంకా మరెన్నో ఇతర కారణాల వల్ల జుట్టు సమస్యలు తలెతుతున్నాయి. జుట్టు రాలుడు నివారణకి కొన్ని సులభమైన ఇంటి చిట్కాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.


మంచి పౌష్టికాహారం తీసుకోవాలి:

 మనం రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల్లో ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉన్నట్లైతే జుట్టు క్రమంగా పెరుగుతుంది. ముఖ్యంగా విటమిన్ ఎ,బి, సి,డి మరియు ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, సెలీనియం ఉన్న ఆహారాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా విటమిన్ బి కాంప్లెక్స్ జుట్టు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో పాలు, పెరుగు, చీజ్ , చికెన్, గుడ్లు, ఆకుకూరలు, చేపలు, బ్రొకోలీ, కూరగాయలు, క్యాబేజి , ద్రాక్ష , అవకాడో, బ్రౌన్ బ్రెడ్, ఓట్స్ ఇలాంటివి మీ డైట్ లో చేర్చుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్, బీన్స్, వాల్

ఆముదం:

 ఆముదం నూనెలో విటమిన్ ఇ, ఫ్యాటీ యాసిడ్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి . ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు నేచురల్ గా మరియు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది. ఇవన్నీ ఆముదం నూనెలో పుష్కలంగా ఉన్నాయి. ఆముదం నూనెను బాదం, ఆలివ్, కొబ్బరి నూనెలో మిక్స్ చేసి రెగ్యులర్ గా తలకు మసాజ్ చేస్తుంది. మసాజ్ చేసిన అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

మసాజ్ :

తలకు వారానికొకసారైన మసాజ్ చేయించుకోవడం వల్ల తలలో రక్తప్రసరణ మెరుగుపడుతుంది, హెయిర్ ఫాలీ సెల్స్ పెరుగుతాయి . డీప్ కండీషన్ వల్ల జుట్టు వేంగంగా పెరుగుతుంది. వేడి నూనెతో మసాజ్ చేయాలి.జుట్టును అప్సైడ్ అండ్ డౌన్ చేయాలి:


  జుట్టు పెరుగుదలకు ఇది మరో పాపులర్ ట్రిక్. మీరు ముందుకు బెండ్ అయ్యా లూజ్ హెయిర్ తో క్రిందికి పూర్తిగా వంగి, పైకి లేయాలి. ఇలా రెండు మూడు నిముషాలు రోజు క్రమం తప్పకుండా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగు అవుతుంది.


ఎగ్ హెయిర్ మాస్క్:

ఎగ్ హెయిర్ మాస్క్ జుట్టు పెరుగుదలకు చాలా చక్కగా పనిచేస్తుంది. ఎగ్ హెయిర్ మాస్క్ గుడ్డులో  ఐరన్, సల్ఫర్, ఫాస్పరస్, జింక్, మరియు సెలీనియం అధికంగా ఉంటుంది. ఎగ్ హెయిర్ మాస్క్ ను నెలకోకసారి వేసుకోవడం వల్ల మంచి ఫలితం లభిస్తుంది.

అలోవెర:

అలోవెర కలబంద తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. చుండ్రు నివారిస్తుంది. నేచురల్ హెయిర్ వాల్యూమ్ పెంచుతుంది. తాజా అలోవెరా జ్యూస్ లో కొద్దిగా నిమ్మరసం మిక్స్ చేసి 20 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకటి రెండు సార్లు చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. అలాగే అలోవెరా జ్యూస్ ను కూడా త్రాగవచ్చు.జుట్టు రాలిపోవడానికి ముఖ్య కారణం ఒత్తిడి. ఒత్తిడి కారణంగా నార్మల్ హెయిర్ సైకిల్  అంతరాయం కలిగిస్తుంది.

దాంతో జుట్టు పెరగకుండా హెయిర్ ఫాల్ కు గురి చేస్తుంది. కాబట్టి, సాధ్యం అయినంత వరకూ ఒత్తిడి లేకుండా జీవించాలి.  ఒత్తిడి తగ్గించుకోవడానికి మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజ్, మరియు విశ్రాంతి పరమైన టెక్నిక్స్ ను ఫాలో అవ్వాలి. ఎక్కువ విశ్రాంతి తీసువడం వల్ల ఆ సమయంలో హార్మోనులు ఎక్కువగా విడుదల అవుతాయి. ఇవి జుట్టు పెరుగుదలకు సహాయపడుతాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: