స‌హ‌జంగా చాలా మందికి త‌మ దిన‌చ‌ర్య‌లో ప‌రిగెత్తే అల‌వాటు ఉంటుంది. ఎలాంటి ఖ‌ర్చు లేని వ్యాయామాల్లో ర‌న్నింగ్ ఒక‌టి. ప్ర‌తి రోజు ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల శరీరంలో కొవ్వు, ట్రైగ్లిజరైడ్ స్థాయిలు, మరియు రక్తనాళాలకు సంబంధించిన గుండెజబ్బుల ప్రమాదం చాలా గణనీయంగా తగ్గింది. ర‌న్నింగ్ చేయ‌డం అనేక ర‌కాలు ఉప‌యోగాలు ఉన్నాయి. 


ఆరోగ్యానికి ర‌న్నింగ్ ఎంతో బాగా స‌హాయ‌ప‌డుతుంది. పరిగెత్తటం వలన కలిగే ప్రయోజనాలు, దూరం మరియు సమయంపై ఆధారపడి ఉండవు. నిజానికి ఎంతో కొంత సమయం కేటాయించి రోజూ పరుగెత్తడం వల్ల చాలా లాభాలే ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుస్తుకుందాం..


- శ‌రీరంలో ముఖ్యంగా కేలరీలు తగ్గించటానికి రన్నింగ్ ఒక అద్భుతమైన వ్యాయామం. కానీ కొత్త‌గా ప్రారంభించిన వాళ్లు ముందు కొంచెం నెమ్మ‌దిగా చేయాలి.


- ప్ర‌తి రోజు ర‌న్నింగ్ చేయ‌డం వ‌ల్ల  వెన్నెముక, ఎముక‌లు బలంగా ఉండ‌డానికి బాగా స‌హాయ‌ప‌డుతుంది. మ‌రియు వృద్ధాప్యంలో ఎముకలు విరిగే ప్రమాదాన్ని నివారిస్తుంది.


- ప్రతి రోజూ జాగింగ్ చేయడం వల్ల జ్ఝాపకశక్తిని పెంచడంతో పాటు మెద‌డును ప్రశాంతంగా ఉంచుతుంది. దాంతో ఎంత కష్టమైన పనైనా సులభంగా అధిగమించి శక్తిని పొందుతారు.


- ప్ర‌తి రోజు రన్నింగ్ చేయ‌డం వ‌ల్ల‌ అలెర్జీలు, కోల్డ్, దగ్గు, ఫ్లూ వంటి మొదలైన ఆరోగ్య సమస్యలు ఉండవు. మ‌రియు రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుతుంది.


- రన్నింగ్ చేయ‌డం వ‌ల్ల రక్త ప్రసరణ బాగా జ‌రిగి గుండె జ‌బ్బులు రాకుండా కాపాడుతుంది. అలాగే రక్తపోటు నిర్వహణ మరియు వివిధ హృదయ సంబంధిత రోగాలు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 


- రన్నింగ్ చేయుటవల్ల మీ శరీరం అలసిపోతుంది. అందువల్ల ప్ర‌శాంత‌మైన, మంచి నిద్రను పొంద‌డానికి స‌హాయ‌ప‌డుతుంది.


- ప్ర‌తి రోజు క్రమం తప్పకుండా రన్నింగ్ చేస్తే రకం-2 మధుమేహం వచ్చే ప్రమాదాన్ని తగ్గించటానికి సహాయపడుతుంది. 


- ప‌రిగెత్త‌డం వ‌ల్ల డిప్రెషన్ మరియు ఆందోళన స్థాయిలు తక్కువగా ఉంచేందుకు సహాయపడుతుంది. ఒత్తిడిని ఓర్చుకునే శక్తి అభివృద్ధికి సహాయపడుతుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: