స‌హ‌జంగా పురాత‌న‌కాలం నుంచి జీల‌క‌ర్ర‌ను వంట‌ల్లో ఉప‌యోగిస్తున్నారు. జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. మ‌నం రోజు వాడే పోపు దినుసుల్లో ఒక‌టిగా మారిపోయింది. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. ఈ రెంటికీ ఔషధ గుణాలున్నాయి. జీల‌క‌ర్ర‌ను సర్వరోగ నివారిణి ఆయుర్వేదంలో ఒకట‌ని కూడా అంటారు. 


ప్రపంచ సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్ధానం ఉంది. నిజానికి జీల‌క‌ర్ర వంట‌ల్లోనే వాడ‌తామ‌ని అనుకుంటారు కానీ.. జీలకర్ర వలన ఆరోగ్యానికి చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- జీలకర్రను కషాయంగా కాచి తాగితే గుండెనొప్పులు రాకుండా అరికడుతుంది. మ‌రియు బీపీ, షుగర్ కంట్రోల్ చేయ‌డంలో బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.


- ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర విత్తనాలు, అల్లం, తేనె మరియు తులసి ఆకులను కలుపుకొని తాగటం వల్ల జలుబు నుండి సులువుగా ఉపశమనం పొంద‌వ‌చ్చు.


- జీలకర్రను నేతిలో వేయించి, మెత్తగా దంచి సైంధవలవణం లేదా ఉప్పును కలిపి అన్నంలో కాని, మజ్జిగలో కాని తీసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల‌ గర్భాశయ బాధలు తగ్గుతాయి.


-  జీలకర్రను గాని, ధనియాలు+ జీలకర్ర మిశ్రమం గాని తీసుకోవ‌డం వ‌ల్ల నీరసం, కాళ్ళ నొప్పులు, పైత్యంతో బాధపడుతున్న వారికి బాగా ఉప‌యోగ‌ప‌డుతుంది.


- అందువల్ల జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల అందులో ఉండే యాంటీ ఫంగల్ లక్ష‌ణాలు శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది.


- జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం వ‌ల్ల‌ పొట్టనొప్పి, అజీర్ణం, మార్నింగ్ సిక్ నెస్‌, వాంతి వికారం,  వంటి అనారోగ్యాలకు చెక్ పెడుతుంది.


- జీలకర్రను నిమ్మరసముతో కలిపి సూర్యోదయ సమయాన, సూర్యాస్తమ సమయమున రెండపూటలా తింటే ... తలతిప్పు, కడుపులోని వేడిని మొదలగు అనారోగ్యాలు త‌గ్గుతాయి.


- జీలకర్ర రోగ నిరిధక శక్తిని పెంచుతుంది. ఇది యాంటీ-ఆక్సిడెంట్స్ గుణాన్ని కలిగి ఉండటం వల్ల శరీరంలో చేరిన మురికిని మరియు ఫ్రీ-రాడికల్స్స‌ను తొలిగిస్తాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: