స‌హ‌జంగా ఈ బిజీ రోజుల్లో 40 ఏళ్లు దాటగానే చాలామందిలో బీపీ, షుగర్ రావడం సర్వసాధారణ‌మైపోయింది. భారత్‌లోని జనాభాలో దాదాపు 30 శాతం మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. అధిక రక్తపోటును నిర్లక్ష్యం చేస్తే గుండె, మూత్రపిండాల జబ్బులకు దారితీసే ప్రమాదం ఉంది. 


ర‌క్త‌పోటు అనేది రోగం కాదు.. రోగ లక్షణం కాదు. హైపర్టెన్షన్‌నే అధిక రక్తపోటు అంటారు. శరీరంలోని అన్ని భాగాలకు కంటే ప్రధానమైన గుండె శరీరంలోని అన్ని భాగాలకు రక్తం పంపిణీ చేస్తుంది. దీనిలో తేడా సంభవించినప్పుడు అధిక రక్తపోటు సూచనలు కనిపిస్తాయి.


రక్తపోటు అధికంగా ఉన్న వారికి ఎలాంటి లక్షణాలు బ‌య‌ట‌కు కనపడవు. కానీ.. చాపకింద నీరులా అది శరీరానికి హాని చేస్తుంది. అందుకే దీన్ని సైలెంట్ కిల్లర్ అని అంటారు. అయితే దీనికి చెక్ పెట్టాంటే మ‌నం కొన్ని ఆహార అల‌వాట్లు మార్చుకుంటే స‌రిపోతుంది. మ‌రి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- ముఖ్యంగా మ‌నం తినే ఆహారంలో ఉప్పు తగ్గించుకోవాలి. ఉప్పులోని సోడియం అధిక ర‌క్త‌పోటుకు కారణం అవుతుంది. అందుకే  సాధ్యమయినంత వరకు ఉప్పుని మితిగా వాడటం అలవాటు చేసుకొనటం మంచిది.


- ప్రతి రోజూ క్ర‌మం తప్పకుండా వ్యాయామం చెయాలి. మ‌రియు అరగంటకి తక్కువ కాకుండా చెమ‌ట ప‌ట్టేలా వాకింగ్ చేయ‌డం చాలా మంచిది.


- ఆల్కహాలు, పొగ తాగ‌డం అల‌వాట్లు ఉన్న‌వారు మానేయాలి. దీనిలో నికొటిన్‌ ఉండడము వలన రక్తనాళాల పై ప్రభావము చూపుతుంది. పొగతాగడం వల్ల రక్తనాళాలు కుచించిపోతాయి.


- క్యారెట్ తిన‌డం వ‌ల్ల ర‌క్త పోటు కంట్రోల్ అవుతుంది. ఇందులో ఉంటే పొటాషియం, బీటా కెరోటిన్ ఉంటాయి. దీని వ‌ల్ల గుండె స‌మ‌స్య‌లు కూడా ద‌రిచేర‌నివ్వ‌దు.


- కొవ్వు పదార్ధాలు ఉండే ఆహారాలు దూరంగా ఉంచుకోవాలి. కొవ్వు అధికంగా ఉండే ప‌దార్ధాలు తీసుకోవ‌డం వ‌ల్ల అధిక ర‌క్త‌పోటుకు దారితీస్తుంది.


-  పీచు పదార్ధాలు ఎక్కువ‌గా ఉన్న ఆహారం తీసుకోవాలి. పండ్లు, కాయకూరలు, ఆకు కూరలు వంటి వాటిల్లో ఎక్కువ పీచు ప‌దార్ధాలు ఉంటాయి. 


- ఓట్స్ తిన‌డం వ‌ల్ల ర‌క్త‌పోటును కంట్రోల్ చేస్తుంది. ఇందులో సోడియం త‌క్కువ‌గా.. పీచు ప‌దార్ధం ఎక్కువగా ఉంటుంది. కాబ‌ట్టి అధిక ర‌క్త‌పోటుతో బాధ‌ప‌డేవారు ఓట్స్ తీసుకోవ‌డం చాలా మంచిది. 


మరింత సమాచారం తెలుసుకోండి: