బిజెపి సీనియర్ నేత మరియు కేంద్ర ఆర్ధిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అరుణ్ జైట్లీ కాసేపటి క్రితం ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచారు. తీవ్ర అనారోగ్య కారణాలతో ఈనెల 9వ తేదీన ఆయన ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చేరడం జరిగింది. అయితే ఆ సమయంలో ఆయన కిడ్నీలకు డయాలసిస్ నిర్వహించడం జరిగింది. ఇక అప్పటినుండి ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తూ వస్తోంది, ఇక మొన్న 17వ తేదీన ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో, ఆయనకు వెంటిలేటర్‌పై చికిత్స అందజేశారు డాక్టర్లు. ఆ తరువాత పరిష్టితి విషమించడంతో ఆయనను లైఫ్‌ సపోర్ట్‌పై ఉంచి చికిత్స అందించడం జరిగింది. ఆ సమయంలో ఆయనకు ఎక్స్‌ట్రా కార్పోరియల్‌ మెంబ్రాన్‌ ఆక్సిజనేషన్‌ ను అమర్చినట్లు వైద్యులు తెలిపారు. శ్వాస తీసుకోవడానికి జైట్లీ తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని, కిడ్నీలు, గుండె పనితీరు కూడా మరింత మందగించిట్లు డాక్టర్లు వెల్లడించారు. 

ఇక అప్పటినుండి వెంటిలేటర్ పైనే ఆయనకు చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. ఇక నేడు ఆయన పరిస్థితి మరింత తీవ్రగా విషమించడంతో, అక్కడి ప్రత్యేక వైద్యుల బృందం ఆయనకు చికిత్స అందించింది. కానీ, అరుణ్ జైట్లీ దక్కలేదు. అనంతరం అరుణ్ జైట్లీ మరణాన్ని ఢిల్లీ ఎయిమ్స్ వైద్యులు ధ్రువీకరించారు. ఆయన స్థానంలో రైల్వే మంత్రిగా ఉన్న పీయూష్ గోయల్ పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది. అయితే, ఏప్రిల్ 2018 నుంచి ఆగస్టు 23 వరకు అనారోగ్యంతో ఇంటికే పరిమితమయ్యారు. కోలుకున్న తర్వాత తిరిగి 2018 ఆగస్టు 23న విధులకు హాజరయ్యారు. ఇక ఇటీవల కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యసమస్యలతో హాస్పిటల్ కె పరిమితం అవడంతో, పలువురు బీజేపీకి నేతలు ఎయిమ్స్ కు చేరుకొని ఎప్పటికపుడు ఆయన ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. అరుణ్ జైట్లీ నవంబర్ 28, 1952న కొత్తఢిల్లీలో పంజాబీ హిందూ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి మహారాజ్ కిషన్ జైట్లీ ప్రముఖ న్యాయవాదిగా పని చేసేవారు. 

అరుణ్ జైట్లీ ఢిల్లీ నుంచే డిగ్రీ మరియు న్యాయశాస్త్ర పట్టా పొందారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అభ్యసిస్తున్నప్పుడు విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా వ్యవహరించారు. విద్యార్థి దశలోనే అరుణ్ జైట్లీ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్తు నాయకుడుగా పనిచేసి, అప్పటి ఎమర్జెన్సీ సమయంలో 19 నెలలు జైలుకు కూడా వెళ్ళారు. అనంతరం జైలు నుంచి విడుదలయ్యాక జనసంఘ్ పార్టీ, అనగా నేటి భారతీయ జనతా పార్టీలో చేరి, ఆ తరువాత విశ్వనాథ్ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రి ఉన్న సమయంలో కొన్నాళ్లపాటు సొలిసిటర్ జనరల్‌గా పనిచేశారు. ఇక ఆ తరువాత  ప్రధాని వాజపేయి నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంలో కేబినెట్ హోదాలో మంత్రిగా నియమితులయి పలు రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎన్నికల బాధ్యతలు సమర్థవంతంగా వ్యవహరించారు. ఇక మొన్నటి 2014 సార్వత్రిక ఎన్నికలలో మొదటిసారిగా ప్రత్యక్ష ఎన్నికలలో అమృత్‌సర్ నియోజకవర్గం నుంచి లోక్ సభ బరిలో నిలిచి అనూహ్యంగా ఓటమిపాలయ్యారు. ఆయన భార్య పేరు సంగీత జైట్లీ, వారికి ఒక కుమారుడు రోహన్, మరియు కుమార్తె సోనాలి. ఇక నేడు ఆయన మరణించిన వార్త తెలియడంతో, కేంద్ర మంత్రి విమల సీతారామన్, ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు బిజెపి నేతలు ఎయిమ్స్ కు హుటాహుటిన చేరుకుంటున్నారు. కాగా పలువురు నేతలు ఆయన మృతికి నివాళులు అర్పిస్తున్నారు.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: