స‌హ‌జంగా చాలా మందికి పీడ క‌ల‌లు వ‌స్తుంటాయి. వీటిలో చాలా మంచి చాలా స‌మ‌స్య‌లు ప‌డుతుంటారు. కలలు చాలా రకాలుగా వస్తాయి. కొంద‌రికి దయ్యాలు, పాములు, దేవుళ్లు, బంధువులు, స్నేహితులు,  ఒక్కో సారి మ‌న‌కు తెలియ‌ని వారు కూడా.. కలలో కనిపిస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వాళ్లతో మాట్లాడినట్లు, పోట్లాడినట్లు కూడా కలలు వస్తుంటారు. ఎన్నో ర‌కాలుగా వ‌చ్చే క‌ల‌లు ఒక్కోసారి ఆనందాన్ని క‌లిగేస్తే.. ఒక్కోసారి భ‌యాన్ని క‌లిగిస్తాయి. కొన్ని క‌ల‌లు మాత్రం చాలా భ‌యంక‌రంగా భ‌య‌పెడుతాయి.


వాటి వల్ల ముఖ్యంగా, ముందుగా వ‌చ్చే స‌మ‌స్య సరిగా నిద్ర పట్టక‌పోవ‌డం. ముఖ్యంగా పీడ‌ కలలు తెల్లవారుజామున 3 గంటలకే ఎక్కువగా వస్తాయట. అందుకే ఆ సమయంలో మనకు నిద్రలో మెలుకువ వచ్చేస్తుంటుంది. పీడ కలలతో బాధపడే వ్యక్తుల్లో కొంద‌రు ఆందోళన, తీవ్ర ఒత్తిడి, భ‌యానికి గురువుతారు. ఈ క్ర‌మంలోనే భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు కూడా ఉన్నాయి.


వాస్త‌వానికి రాత్రి ఎన్ని కలలు వచ్చినా  నిద్రలేచేసరికి కలల సంగతే గుర్తుండదు. ఉదయం లేచిన మొదటి నిమిషానికే 90 శాతం కల మరిచిపోయి ఉంటాం. అయితే మ‌నం ఎక్కువ‌గా అన‌వ‌స‌ర విష‌యాలు ఆలోచిస్తుంటే అవి అనేక రూపాలుగా క‌ల‌లు వ‌స్తుంటాయి. అలాగే మ‌ధ్యం సేవించే వారికి పీడ క‌ల‌లు ఎక్కువ‌గా వ‌స్తాయి. మ‌రి కొన్ని సార్లు కలలు క్రియేటివ్ ఐడియాలను కూడా ఇస్తాయి. చాలా వరకు మనుషులకు వచ్చే కలలు చాలా ప్రతికూలంగా ఉంటాయి. అలాంటి వారు చాలా ఇబ్బంది ప‌డ‌తారు. 


పీడ క‌ల‌ల‌తో బాధ‌ప‌డేవారు ప‌డుకునే గ‌దిలోకి బాగా గాలి, వెలుతురు, వచ్చే టట్లు చూసుకోవాలి. మ‌రియు బెడ్‌ను శ‌భ్రంగా ఉంచుకోవాలి. ధ్యానం చేయడం వల్ల‌ చాలా వరకు పీడ కలలు రాకుండా ప్రశాంతంగా నిద్రించవచ్చు.  హారర్ మూవీస్, షాకింగ్ వీడియోలను, ఆక్సిడెంట్ వీడియోలో చూడ‌క‌పోవ‌డం మంచిది. మ‌ధ్యం, ధూమ‌పానం మానుకోవ‌డం చాలా ఉత్త‌మం.


మరింత సమాచారం తెలుసుకోండి: