స‌హ‌జంగా త‌ల‌నొప్పి అనేది సాధార‌ణ ఆరోగ్య స‌మ‌స్య‌. వ‌య‌సుతో తేడాలేకుండా త‌ల‌నొప్పికి గుర‌వుతారు. ఒత్తిడి, మానసిక సమస్యలు, ఆందోళన  వంటి అనేక కారణాల వల్ల మనకు తలనొప్పి వస్తుంటుంది. దీంతో ఏ పని చేయాలన్నా చాలా ఇబ్బందిగా ఉంటుంది. తలకు ఒక వైపు వెళ్ళే నరాలు అకస్మాతుగా కుచించుకుపోవడం, ఇవే నరాలు ఒక్కసారిగా వ్యాకోచించడం వల్ల‌ అక్కడికి అధిక రక్తం ప్రవహించి మైగ్రేన్ తలనొప్పి వస్తుంది. నొప్పిని తగ్గించాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం కనిపించదు. ఇలాంటి సమస్యలకు ఈ చిట్కాల‌తో చెక్ పెట్టండి.. 


- బాగా త‌ల‌నొప్పిగా ఉన్న‌ప్పుడు ఒక‌ గ్లాస్ గోరు వెచ్చని పాలలో చిటికెడు పసుపు కలుపుకుని తాగితే తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. 


- ఉల్లిపాయల్ని పేస్ట్‌లా చేసి ఆ మిశ్ర‌మాన్ని తల మీద పెట్టుకుంటే తలనొప్పి బాధ నుంచి ఉపశమనం ల‌భిస్తుంది.


- త‌ల‌నొప్పితో బాధ‌ప‌డేవారు గోరువెచ్చిన నీటిలో నిమ్మ‌ర‌సం క‌లిపి తాగితే ఫ‌లితం ఉంటుంది. తలనొప్పిని నివారించడంలో నిమ్మరసం ఎఫెక్టివ్‌గా ప‌నిచేస్తుంది.


- విప‌రీత‌మైన త‌లనొప్పి వ‌చ్చిన‌ప్పుడు నీళ్ల‌లో చక్కెర, ధనియాలు కలిపి తాగినా తలనొప్పి తగ్గుతుంది. 


-  బాగా తలనొప్పిగా ఉన్నప్పుడు జీడిపప్పు, పిస్తా, బాదంపప్పులను తింటే వెంటనే తలనొప్పి తగ్గుతుంది. త‌ల‌నొప్పికి ఇవి పెయిన్ కిల్లర్స్‌గా ఉప‌యోగ‌ప‌డుతుంది.


- అరకప్పు నీటిలో ఒక టీస్పూను అల్లం రసం కలిపి వేడిగా తాగాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల త‌ల‌నొప్పి నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: