వ‌ర్షాకాలం వ‌చ్చిందంటే చాలు ఎక్క‌డ లేని దోమ‌లు ఇంట్లోనే ఉంటాయి. చూడడానికి చిన్నదే అయినా దానివల్ల కలిగే నష్టం మాత్రం భారీగా ఉంటుంది. వ‌ర్షాకాలంలో డెంగ్యూ వ్యాధికి మూల కారణమైన దోమ ప్రజలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తుంది. ఈ దోమ‌ల విష‌యంలో అప్రమ‌త్తంగా లేకుంటే ఇబ్బందులు త‌ప్ప‌వు. అయితే దోమ కార‌ణంగా ఓ మ‌హిళ చావు చివ‌రి అంచుల వ‌ర‌కు వెళ్లింది. అస‌లు వివ‌రాల్లోకి వెళ్తే.. ఆగ్నేయ ఇంగ్లాండ్‌లోని ఎసెక్స్‌లో నివసించే కిమ్ రాబిన్సన్  అనే మహిళ గార్డెన్‌లో ప‌ని చేస్తుండ‌గా త‌న కాలి చీలమండ మీద ఓ దోమ కుట్టింది.


కొంత స‌మ‌యం త‌ర్వాత బాగా వాచిపోయి కుట్టిన చోట్ట మొత్తం న‌ల్ల‌గా మ‌రిపోయింది. దీంతో న‌డ‌వ‌డానికే క‌ష్టమైంది. ఆందోళ‌న చెందిన ఇంటి స‌భ్యులు వెంట‌నే ఆమెను ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. ప‌రీక్ష‌లు చేసిన వైద్యులు ఆమెకు కాలికి నెక్రోటైజింగ్ ఫాసిటిస్ అనే వ్యాధి సోకినట్లు గుర్తించారు. దీని వ‌ల్ల చ‌ర్మాన్ని బ్యాక్టీరియా తినేస్తుంద‌ని.. వెంట‌నే ఆ భాగాన్ని తొల‌గించ‌క‌పోతే చాలా ప్ర‌మాద‌మ‌ని చెప్పారు. అయితే స‌ర్ట‌రీ చేస్తుండంగానే ఆమె ప్రాణాలు కోల్పోయింది. 


వెంట‌నే స‌ర్జ‌రీని నిలిపిన డాక్ట‌ర్లు ఆమెకు గుండె తిరిగి పనిచేసేలా చికిత్స అందించారు. మూడు నిమిషాల త‌ర్వాత మ‌ళ్లీ ప్రాణం పోసుకున్న ఆమెకు  సుమారు 12 గంటలసేపు సర్జరీ జ‌రిగింది. స‌ర్జ‌రీలో ఆమె పొట్ట భాగంలోని చర్మాన్ని తీసి కాలి చీలమండ వద్ద అతికించారు. అలాగే ఆమె సుమారు ఐదు రోజులు కోమాలో ఉండిపోయింది.  12 వారాల చికిత్స తర్వాత ఆమె సాధారణ స్థితికి చేరింది. వాస్త‌వానికి వ‌ర్షాకాలంలో దోమ‌లు అధికం.. జ‌బ్బులు అధికం.. అందుకే దోమ‌ల‌తో బీ కేర్‌ఫుల్‌..


మరింత సమాచారం తెలుసుకోండి: