స‌హ‌జంగా శారీరక, మానసిక ఆరోగ్యం అందించే యోగా ప్రపంచవ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందుతోంది. యోగా అనేది 5 వేల సంవత్సరాల నుండి భారతదేశంలో ఉన్న జ్ఞానముయొక్క అంతర్భాగము. యోగాతో ఎన్నో స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు. కానీ యోగా కార‌ణంగా ఓ అమ్మాయి ప్రాణాలు కొరివి తెచ్చుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే..మెక్సికోలోని ఒక కళాశాల విద్యార్థిని శనివారం బాల్కనీ నుండి 80 అడుగుల కింద‌కి పడిపోయింది. 


అలెక్సా టెర్రాజా శాన్ పెడ్రోలోని తన ఆరవ అంతస్తు బాల్కనీ అంచున విపరీతమైన యోగా భంగిమలు ప్రాక్టీస్ చేస్తుంది. ఆ స‌మ‌యంలోనే ఆమె అదుపు త‌ప్ప‌డంతో కింద ప‌డిపోయింది. ప‌క్క‌నే ఉన్న ఆమె స్నేహితురాలు ఆమెను కాపాడ‌డం పోయి ఫోటో తీసి ఇంటర్నెట్‌లో షేర్‌ చేసింది. అలెక్సా తలక్రిందులుగా వేలాడుతూ కింద‌కు ప‌డిపోయే ఈ చిత్రం విసృతంగా వైర‌ల్ అవుతుంది.


వెంట‌నే హాస్ప‌ట‌ల్‌కు త‌ర‌లించిన ఆమెకు వైద్యులు 11 గంటల పాటు చికిత్స‌ను అందించారు. చికిత్స అనంత‌రం వైద్యులు మాట్లాడుతూ  ఆమె నడుము, కాళ్లు, చేతులు, తల  భాగంలో చాలా గాయలయ్యాయి. దాదాపు ఆమె శ‌రీరంలో 110 ఎముకలు విరిగాయి అని చెప్పారు. సోమవారం నాటికి ఆమె పరిస్థితి విషమంగా మారింది. క‌నీసం ఆమె కోలుకోవాలంటే మూడేళ్లు అయినా ప‌డుతుందంటున్నారు వైద్య‌లు. అందుకే ఎప్పుడు కూడా యోగా నిపుణుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లోనే చేయాల‌ని హెచ్చ‌రించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: