స‌హ‌జంగా త‌ల్లిదండ్ర‌ల‌కు త‌మ కుతుళ్ల భ‌విష్య‌త్తుపై ఆందోళ‌న‌గా ఉంటుంది. ఆడ‌పిల్ల‌ల‌ను చ‌దివించ‌డం కోసం, పెళ్లి చేడ‌యం కోసం ఎన్నో ఇబ్బందులు ప‌డుతుంటారు. కానీ ఇప్పుడు ఎలాంటి భ‌యం ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. సుకన్య సంవృద్ది యోజ‌న‌ అనేది ఆడపిల్ల సంపద పథకం. అడ పిల్లల కోసం కేంద్ర ప్రభుత్వం 2014 డిసెంబర్ 2న ప్ర‌వేశ పెట్టిన ప‌థ‌కం. ఈ ప‌థ‌కం వ‌ల్ల‌  ఇప్పట్నుంచే కొద్దికొద్దిగా పొదుపు చేస్తూ ఉంటే మీ అమ్మాయి పైచదువులకు లేదా పెళ్లి నాటికి కావాల్సిన డబ్బు సమకూరుతుంది.


ఇది ఓ ప్రత్యేక డిపాజిట్ పథకం. ఈ పథకం కింద శాతం 9.1 వడ్డీ అందించబడుతుంది. దీనికి ఏటువంటి పన్ను లేదు. ఇది ఒక సేవింగ్ ఖాతా అని చెప్ప‌వ‌చ్చు. ఈ స‌థ‌కాన్ని 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌స్సు ఉన్న ఆడ‌పిల్ల‌ల‌కు వ‌ర్తిస్తుంది. ఒకే ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలున్నా, ఒకే కాన్పులో ముగ్గురు ఆడబిడ్డలు జ న్మించినా వీరికి ఈ పథకం వ ర్తిస్తుంది. దేశంలోని అన్ని పోస్ట్ ఆఫీసుల్లో సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ తెరవచ్చు. బ్యాంకులు కూడా సుకన్య సమృద్ధి యోజన అకౌంట్స్ ఆఫర్ చేస్తున్నాయి. 


ఈ ఖాతా కోసం కనీస డిపాజిట్ మొత్తాన్ని రూ.1000/- మరియు గరిష్ఠం సంవత్సరానికి రూ.1,50,000 వర‌కు డిపాజిట్ చేయావచ్చు. ఈ  డబ్బును 14 సంవత్సరాలు ఉంచ వలసి ఉంటుంది. నెలకు ఒకసారి లేదా ఒక సంవత్సరంలో వీలున్నప్పుడు ఖాతాలో డబ్బులు జమ చేయవచ్చు. డీడీ లేదా చెక్కు ద్వారా మాత్రమే జమ చేయాలి. అమ్మాయి వయసు 18 సంవత్సరాలు నిండిన తరువాత ఉన్నత చదువుల కోసం 50 శాతం నగదుగా తీసుకోవచ్చు. ఆదాయపు పన్ను సెక్షన్‌ 80 సీ ప్రకారం పన్ను మినహాయింపు వర్తిస్తుంది. 18 సంవత్సరాల తర్వాత వివాహం చేయాలనుకుంటే మొత్తం సొమ్ము తీసుకోవచ్చు. 


పొదుపు వివ‌రాలు:


నెలకు.................. ఏడాదికి................14ఏళ్లకు...................21ఏళ్లకు


రూ.1000                రూ.12వేలు          రూ.1.68లక్షలు        రూ.6,07,128


రూ.2,500               రూ.30వేలు         రూ.4.20లక్షలు        రూ.15,17,820


రూ.5,000               రూ.60వేలు         రూ.8.40లక్షలు         రూ.30,35,640


రూ.7.500               రూ.90 వేలు        రూ.12.60లక్షలు       రూ.45,53.460


రూ.10వేలు           రూ.1.20వేలు      రూ.16.80లక్షలు       రూ.60,71,250


రూ.12,500వేలు    రూ.1.50 వేలు      రూ.21లక్షలు           రూ.75,89,103


మరింత సమాచారం తెలుసుకోండి: