సహజంగా మనం ఉదయం తాగిన నీరు 11గంటల వరకు శరీర అవసరాలను తీర్చడానికి సరిపోతుంది. ఆ సమయం నుంచి శరీరానికి నీటి అవసరం మళ్లీ ఉంటుంది. పగలు తాగిన నీరు శరీరాన్ని శుభ్రపరచడానికి పనికి రాదు. కానీ.. శరీరాన్ని ఎండ నుంచి కాపాడుకోవడానికి, పని చేస్తున్నప్పుడు కండ‌రాల్లో పుట్టే వేడిని చల్లార్చడానికి, జీర్ణాది రసాలు ఉత్పత్తికి సహకరిస్తుంది. పగటిపూట మనం రెండున్నర లీటర్ల నీరు తాగితే మంచిది. ఈ నీటిని ఎప్పుడు పడితే అప్పుడు.. తినేటప్పుడు కాకుండా ఒక పద్ధతి ప్రకారం తాగితే మంచిది.


రెండవ దఫా నీటిని తాగిన తర్వాత 25- 30 నిమిషాల గ్యాప్ ఇచ్చి టిఫిన్ తినొచ్చు. టిఫిన్ తినేటప్పుడు నీరు తాగకూడదు. మ‌రియు టిఫిన్ తిన్న రెండు గంటల తర్వాత నీటిని ఒకేసారి తాగకూడదు. అలా తాగితే బరువుగా, ఆయాసంగా ఉంటుంది. మధ్యాహ్నం భోజనానికి అరగంట ముందు వరకు నీరు తాగి ఆపి వేయాలి. ఇక భోజన సమయంలో మంచి నీరు తాగకూడదు.


నాలుగోవ దఫా నీరు మధ్యాహ్నం భోజనం అయిన రెండు గంటల తర్వాత రెండు- మూడు అంచెలుగా లీటర్ నుంచి లీడ‌రంపావు వరకు నీటిని తాగవచ్చు. ఇలా తాగిన నీరు జీర్ణమైన ఆహారాన్నిపేగులు పీల్చుకోవ‌టానికి సహకరిస్తుంది. 55- 60 సంవత్సరాలు పైబడిన వారు సాయంకాలం 4-5 గంటలు దాటిన తర్వాత నీరు తాగకుండా ఉంటే రాత్రివేళల్లో మూత్ర సమస్యలు ఉండవు. ఇక ఐద‌వ ద‌ఫా నీరు అందరికీ అవసరం లేదు. 


ఎవరైతే నాల్గువ ద‌ఫాలో నీరు త‌క్కువ‌గా తాగేవారు, బాగా ఎండలో చెమటలు పట్టేలా పనిచేసేవారి, యుక్తవయసులో ఉన్నవారికి మంచిది. రాత్రిపూట నీటిని పెద్ద‌గా తాగ‌న‌వ‌సరం లేదు. ఎవరికన్నా 9-10గంట‌ల‌కు దాహం అనిపిస్తే అరగ్లాసు నీరు తాగి పడుకోవచ్చు. ఈ సూచ‌న‌లు శ‌రీరానికి కావాల్సిన క‌నీస నిటి అవసరాన్ని తెలిపేది మాత్రమే.


మరింత సమాచారం తెలుసుకోండి: