స‌హ‌జంగా నోటి ఆరోగ్యం మరియు దంతాల ఆరోగ్యం అందరికీ చాలా ముఖ్యం. దంతాల ఆరోగ్యం మన ఆరోగ్యంలో ముఖ్య భాగం. మనం ఏ వయస్సులో ఉన్నా మనం ఆరోగ్యకరమైన పళ్ళను కలిగి ఉండవచ్చు, ఉండాలి కూడా. పళ్ళ విషయంలో సరైన శ్రధ్ధ తీసుకొన్నట్లైతే ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కోవాలి. 


అయితే కాఫీ, టీ, కోలాలు ఎక్కువ‌గా తాగడం వల్ల పళ్ళు పసుపు ప‌చ్చగా మారతాయి. ఈ స‌మ‌స్య‌తో చాలా మంది ఇబ్బంది ప‌డుతుంటారు. ఈ సమస్యను పోగొట్టి, ముత్యాల్లాంటి పళ్ళ వరసను సొంతం చేసుకోవాలంటే.. మన వంటింట్లో లభించే పదార్థాలతోనే చేసుకోవచ్చు. 


- అరటి పండూ, కమలాపండు తొక్క లోపలి భాగాలతో పళ్లపై మృదువుగా రుద్దాలి. ఈ పండ్ల తొక్కల్లో ఉండే మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్ వ‌ల్ల‌ ఎనామిల్‌కు రక్షణగా ఉంటాయి. ఎలా చేసినా కొన్ని నిమిషాల తర్వాత పళ్ళు తోముకోవాలి వారంలో రెండు సార్లు ఇలా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.


- తాజా కూరగాయలు, పండ్లను తరచూ ఆహారంతో పాటు తీసుకోవాలి. ఇవన్నీ పళ్లపై ఉండే ఎనామిల్‌కు హాని చేయకుండా పసుపు ధనాన్ని పోగొడతాయి. పాలు, పాల పదార్థాలు తీసుకోవడం వల్ల నోటిలోని పీహెచ్ స్థాయులు పెరిగి ఎనామిల్ పోకుండా ర‌క్షిస్తుంది.


-  ప‌రిశుభ్ర‌మైన‌ కొబ్బరి నూనెను నోట్లో అన్ని భాగాలను తాకేలా పావుగంట సేపు పుక్కిలించాలి. ఆ త‌ర్వాత‌ ఉమ్మేసి నోరు శుభ్రం చేసుకుని వెంటనే రెండు గ్లాసుల నీరు తాగాలి. కొబ్బరినూనెలో లారిక్ ఆమ్లం దంతాల‌పై ప‌సుపుద‌నానికి కారణమయ్యే బ్యాక్టీరియాను నశింపచేస్తుంది.


- అలాగే టూత్ పేస్ట్ కు బదులుగా ఉప్పుతో దంతాలను శుభ్రం చేసుకుంటే పళ్ళును తెల్లగా మారేలా చేస్తుంది. మ‌రియు టూత్ పేస్ట్‌తో కొద్దిగా వంట‌సోడా మిక్స్ చేసిన వాడినా దంతాల‌ను తెల్ల‌గా మార‌తాయి.


- రోజూ తెల్లటి టూత్‌పేస్ట్‌ వాడే బదులు క‌నీసం వారంలో రెండుసార్లు ఆయుర్వేద వన మూలికలతో తయారు చేసిన పళ్లపొడులను వాడటం వ‌ల్ల ప‌ళ్లు తెల్ల‌గా మ‌ర‌తాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: