ముగ్గురు కాదు.. ఐదుగురు కాదు.. ఒకే బైకుపై ఏకంగా ఏడుగురు ప్రయాణించారు. కుక్క, కోడిని కూడా వదల్లేదు.
ఈ వీడియో చూస్తే అది బైకా, మినీ బస్సా? అనే అనుమానం రాక మానదు. ఓ వ్యక్తి తన ఆరుగురు కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లు షిఫ్ట్ అవుదామని అనుకున్నాడు. ఆటోకు డబ్బులవుతాయనే ఉద్దేశంతో తన బైకునే చిన్న సైజు ట్రక్కులా మార్చేసుకున్నాడు. బైకు చుట్టు వస్తువులను కట్టేశాడు. ఆ తర్వాత పెంపుడు కుక్క, కోడితో సహా బైకు మీద.


రిషాద్ కూపర్ అనే ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా చక్కర్లు కొడుతోంది. బైకు వెనుక వైపు ఒక మహిళ, ముగ్గురు చిన్నారులు కూర్చోగా, ముందు వైపు ఇద్దరు పిల్లలతో ఆ వ్యక్తి ప్రయాణం చేయడాన్ని ఈ వీడియోలో చూడవచ్చు. పైగా వీళ్లు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం గమనార్హం.


ఈ వీడియో చూసినవాళ్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ బైక్ తయారు చేసిన సంస్థ తప్పకుండా ఆ ఫ్యామిలీకి అవార్డు ఇస్తుందని నెటిజనులు కామెంట్ చేశారు. ఇలా ప్రయాణం చేయడం చాలా ప్రమాదకరమని కొందరు హెచ్చరించారు. ఈ బైకు ముందు ఎస్‌యూవీ కూడా వేస్టేనంటూ మరికొందరు కామెంట్ చేశారు. బైకు మీద ఇద్దరు కు మించి ముగ్గురు కూడా ఉండకూడదు అని ట్రాఫిక్ రూల్స్ ఉండగా ముగ్గురు వెళ్తుంటే కూడా ఫైండ్ వేయకుండా వెల్లడిస్తున్న ట్రాఫిక్ పోలీసులు ఉండటమే కాకుండా, జరిమానా లేదా జైలు శిక్షలు వేయకుండా వదిలేస్తే ఇటువంటివి కొనసాగుతూనే ఉంటాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: