పెళ్లికాని యువ‌కుల‌కు ప్ర‌భుత్వమే బంప‌ర్‌ ఆఫ‌ర్ ఇచ్చింది. త‌మ‌కు న‌చ్చిన లైఫ్ పార్ట్న‌ర్‌ను వెతుక్కునేలా ఓ కార్య‌క్ర‌మాన్ని చేప‌ట్టింది. అదే  ‘లవ్ ఎక్స్‌ప్రెస్’. చైనాలో చాలా మంది యువకులకు జీవిత భాగస్వామి దొరకడం లేదు. తల్లిదండ్రులు ఒక బిడ్డతోనే సరిపెట్టుకోవాలనే ప్రభుత్వ నిబంధన కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది. అయితే ఈ క్ర‌మంలోనే అక్క‌డ ప్ర‌భుత్వం 1000 మంది యువ‌కులు, 1000 మంది యువ‌తుల‌ను ఓ ట్రైన్‌లో పెట్టారు.


అయితే అందులో జ‌ర్నీ చేసే క్ర‌మంలోనే త‌మ‌కు న‌చ్చిన అమ్మాయిని సెల‌క్ట్ చేసుకోవ‌చ్చ‌ని ఆఫ‌ర్ చేసింది. గత వారం, 1000 మందికి పైగా యువతీ యువకులు త‌మ జీవిత భాగ‌స్వామిని క‌నుగొనేందుకు ఈ లవ్ ఎక్స్‌ప్రెస్‌లో రాత్రిపూట యాత్ర చేశారు. డైలీ మెయిల్ ప్రకారం, ఈ యాత్ర రెండు రోజుల వన్-నైట్ విహారయాత్ర. దీనిని చెంగ్డు యొక్క రైల్వే అథారిటీతో పాటు కమ్యూనిస్ట్ యూత్ లీగ్ ఆఫ్ చాంగ్కింగ్ ప్రారంభించింది.


ఇక 10 కోచ్‌లు కలిగిన ఈ లవ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను మూడేళ్ల క్రితం దేశంలోని 200 మిలియన్ల ఒంటరి వ్యక్తులకు ‘మ్యాచ్ మేకింగ్ సర్వీస్’ అందించేందుకు ప్రారంభించారు. ఈ రైలులో ఇప్పటివరకూ మూడు వేలకు మించిన యువకులు, యువతులు ప్రయాణించారు.  వీరిలో కొంద‌రు ఇప్ప‌టికే పెళ్లి చేసుకోగా... మ‌రికొంద‌రు రిలేషన్‌షిప్‌లో కొనసాగుతున్నారు. 


అలాగే ప్రయాణీకులు ‘లవ్ ఎక్స్‌ప్రెస్’ నిర్వాహకులు రూపొందించిన వివిధ ఆటలను ఆడతారు.  వీటిలో పాల్గొంటే ఒకరినొకరు తెలుసుకోవ‌డానికి లేదా అర్థం చేసుకోవ‌డానికి సహాయపడుతుంది. ఈ క్ర‌మంలోనే ఇటీవ‌ల యాంగ్ హువాన్ అనే యువ‌కుడు ఈ ప్రయాణంలో త‌న జీవిత భాగ‌స్వామి దొరికింద‌ని వెల్ల‌డించాడు.  


మరింత సమాచారం తెలుసుకోండి: