ప్రపంచంలో దాదాపుగా ఏ ప్రాణికి ఉండనంత ప్రత్యేకత దీని స్వంతం.పక్షులలో ఐతే మరీ స్పెషల్ పక్షి అంటారు.ఇంతకు దీని ప్రత్యేకత ఏంటంటే నీరుతాగడం.వాటర్ తాగడం కూడ ఓ ప్రత్యేకమైన పనేనా దాంట్లో ఏముంది వింత అంటారేమో.అసలు ఉన్నదంతా ప్రత్యేకత అందులోనే వుంది.ఇది ఏ వాటర్ పడితే అది తాగదు.మరి మనలా మినరల్ వాటర్ తాగుద్దా అని సెటైర్ వేస్తారేమో.అవును మినరల్ వాటరే అది స్వచ్చమైన వాటర్.ఇంతకు దీని కధ ఏంటో విందాం పదండి.



ఎప్పుడైన,ఎవరైన,ఎవరికోసమైనా ఎదురుచూస్తుంటే,వారిని'చాతకపక్షి'లాఎదురు చూస్తున్నారు,అని అంటుంటారు.అంటే తనకు కావలసిన దానికోసం ఓర్పుతో వేచి ఉండే ఎదురు చూపులకు ఈ చాతక పక్షిని ఉదాహరణగా చెప్తారు.ఎందుకంటే ఈ చాతకపక్షి వర్షపు చినుకుల కోసం ఎంతలా నిరీక్షిస్తుందంటే,తొలకరికోసం పుడమి ఎలాఎదురు చూస్తుందో అలా,ఎదురు చూస్తుందన్న మాట.ఇక చాతకంఅంటే నీటికోకిల జాతికిచెందిన ఒకపక్షి అని అర్ధం.ఈ చాతక పక్షి నేల మీద ఉండే నీరు త్రాగనే తాగదు.వర్షం పడుతున్నప్పుడు మాత్రమే వాన చినుకుల్ని నోరుతెరచి పట్టుకుని మింగుతుంటుంది.



ఈ పక్షి మన సాంప్రదాయం ప్రకారం కేవలం తొలకరి వర్షపు నీటినే తాగుతుంది.ఒక తొలకరి అయ్యాక మరలా తొలకరి వరకూ వేరే నీరు ముట్టదు.అందుకే అది తక్కిన ఋతువుల్లో దాహంతో అలమటిస్తూ అరుస్తూ ఉంటుంది.తెలుసుకున్నారు కదా ఈ పక్షి ప్రత్యేకత.అందుకే దీన్ని ప్రత్యేకమైన పక్షి అన్నారు.ఈ పక్షులు ఎక్కువగా మన భారతదేశంలో కొల్లేరు సరస్సు సమీపంలో సంచరిస్తూ వుంటాయి ఈ చాతక పక్షికి ఈ పరిస్దితి శాపమని చెబుతారు.అది నిజమో ఏమో తెలియదు కాని ప్రచారంలో మాత్రం వుంది..ఇప్పుడు చెప్పండి ఈ పుడమి పైనా తొలకరి చినుకు కోసం ఎదురు చూసే పక్షి వుందా,.బ్రతుకు దెరువుకోసం రైతులు చినుకు కోసం చూస్తారు కాని ఈ పక్షి బ్రతకడం కోసం ఎదురు చూస్తుంది.ఇదండి దీని కధ..

మరింత సమాచారం తెలుసుకోండి: