స‌హ‌జంగా పెళ్లి తర్వాత ప్రతి మహిళా గర్భం ధరించే శుభ సమయం కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తుంటుంది. అయితే ఈ సమయంలో వాంతులు, క్రమంగా బరువు పెరగడం, హార్మోన్లలో వచ్చే తేడాలు, శారీరక మార్పులు, నొప్పులు.. మొదలైన వాటి వల్ల మొదట్లో మహిళలు కాస్త అసౌకర్యంగా ఫీలవడం సహజం. అలాగే డెలివరీ సమయం దగ్గర పడే కొద్దీ ఒత్తిడి, ఆందోళన, ప్రసవం ఎలా జరుగుతుందోననే భయం.. ఇలా మానసిక పరమైన టెన్షన్లు కూడా ఎదురవుతుంటాయి.


మరి వారిలో దశల వారీగా ఎదురయ్యే ఇలాంటి సమస్యల వల్ల వారు ప్రెగ్నెన్సీని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతారు. దీని ప్రభావం కాబోయే తల్లిపైనే కాదు.. కడుపులో పెరుగుతున్న బిడ్డపైనా పడే అవకాశం ఉంటుంది. కాబట్టి స్త్రీలంతా ఎంతో ఆశగా ఎదురుచూసే ప్రెగ్నెన్సీ సమయంలో ఆనందంగా గడపాలంటే కొన్ని అంశాలు దృష్టిలో ఉంచుకోక తప్పదు. గర్భం ధరించినప్పుడు మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇందుకు కొన్ని మంచి అలవాట్లు ఉపయోగపడతాయి.


ఉదాహరణకు  మీకు చెస్, క్యారమ్స్ వంటి ఆటలాడడం, పుస్తకాలు చదవడం, పాటలు వినడం, సినిమాలు చూడడం వంటివన్నీ ఇష్టమనుకోండి.. వీటన్నింటికీ రోజులో కొంత సమయం కేటాయించాలి. ఫలితంగా ప్రెగ్నెన్సీ సమయంలో ఎదురయ్యే సమస్యలను సులభంగా ఎదుర్కోవచ్చు. అంతేకాదు మానసికంగా కూడా చురుగ్గా ఉండాలి. ఇవన్నీ అటు మనసుకు, ఇటు శరీరానికి ఆనందాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. అప్పుడు డెల‌వ‌రీ స‌మ‌యంలో మాన‌సిక స‌మ‌స్య‌ల నుండి ర‌క్షించుకోవ‌చ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: