సాధార‌ణంగా అందాన్ని రెట్టింపు చేసే వాటిలో జుట్టు కూడా ఒక‌టి. జుట్టు పొడ‌వుగా ఉంటే ఎవ‌రైనా ఇష్ట‌ప‌డ‌తారు. చాలా మంది జుట్టు రాలకుండా ఉండటానికి, పొడవుగా పెరగడానికి ఎన్ని ఉపయోగించినా ఫ‌లితం క‌నిపించ‌క బాధ‌ప‌డుతుంటారు. అయితే కొబ్బ‌రిపాలు శిరోజాల సంర‌క్ష‌ణ‌లో కీల‌క పాత్ర పోషిస్తుంది. కొబ్బరి పాలలో ఉన్న పోషకాలు జుట్టు యొక్క పెరుగుదలకు చాలా అనుకూలంగా ఉంటుంది. అలాగే కొబ్బ‌రిపాల వ‌ల్ల శిరోజాల‌కు ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..


- జుట్టు పొడిబారి, దురదగా అనిపిస్తున్నప్పుడు కొబ్బ‌రి పాలను తలకు రాసుకుని మర్దన చేసి కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకోవాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల జుట్టు ఎదుగుద‌ల‌కు కొబ్బ‌రిపాల‌లో ఉన్న పోష‌కాలు స‌హాయ‌ప‌డ‌తాయి.


- కొబ్బరిపాలల్లో తేమనందించే గుణాలు ఎక్కువ. కొబ్బ‌రిపాల‌ను త‌ల‌కు రాసుకోవ‌డం వ‌ల్ల జ‌ట్టు చిట్లిన సమస్య అదుపులోకి వ‌చ్చి జ‌ట్టు ఆరోగ్యంగా ఎదుగుతుంది.


- కొబ్బరి పాలలో కొద్దిగా నిమ్మరసం కలపాలి. నిమ్మరసానికి క్లెన్సింగ్‌ గుణం ఉంటుంది. కొబ్బరి పాలు, నిమ్మరసం కలిపి వాడడం వల్ల జుట్టుకి అందమైన, ఆరోగ్యమైన లుక్‌ వస్తుంది.


- కొబ్బరి పాలలో వోట్మీల్‌ను మిక్స్ చేసి త‌ల‌కు ప‌ట్టించాలి. కొంతసేపు మసాజ్ చేసిన తర్వాత త‌ల‌స్నాం చేస్తే జుట్టు న‌ల్ల‌గా, ఆరోగ్యంగా ఉంటుంది.


- కొబ్బ‌రి పాల‌లో ఎగ్ వైట్‌ను మిక్స్ చేసి త‌ల‌కు ప‌ట్టించాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత త‌ల‌స్నానం చేయ‌డం వ‌ల్ల చుండ్రు, పొడిబార‌డం వంటి స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.


- కొబ్బరి పాలను మరియు ఆలివ్ నూనెను త‌ల‌కు మ‌సాజ్ చేసుకోవాలి. కొంత స‌మ‌యం త‌ర్వాత వాష్ చేసుకోవ‌డం వ‌ల్ల జ‌ట్టు స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్ట‌వ‌చ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: