ఈ కాలంలో సెల్ వాడని వారంటూ లోకంలో లేరు.గరీబ్ నుండి,నవాబ్ వరకు,ముసలి నుండి పడుచు వరకు ఎవరి చేతిలో చూసిన సెల్లు సొల్లే.ప్రపంచంలో పైసలు లేని వారు, తినడానికి తిండి లేని వారు ఉన్నారంటే నమ్మవచ్చూ కాని సెల్‌ఫోన్ లేని వారున్నారంటే నమ్మడం అసాధ్యం.ఇంతగా మనజీవితంలో భాగమైన సెల్ దీర్ఘ చ‌తుర‌స్రం లోనే ఎందుకుంటుందనే విషయం ఎంతమందికి తెలుసు,తెలియకుంటే కనీసం తెలుసుకునే ప్రయత్నం ఐనా చేసారా.మాకెందుకులే అనుకుంటున్నారా పొరపాటున కూడా అలా అనుకోకండి ఎందుకంటే కట్టుకున్న పెళ్లాం లేకుండా ఐనా వుంటాం కావచ్చూ కాని ఒక్క సెకండ్ సెల్ లేకుండా ఉండటం అసంభవం.నిజమా కాదా మీ గుండెల మీద చెయ్యేసి చెప్పండి.సరేలే మీ ఆలోచనలతో నాకు పనేంటి నే చెప్పేది నేను చెబుతాను వినండి.



3:2,..16:9 aspect ratio అని మీరు ఎక్క‌డైనా చ‌దివారా..?చ‌దివే ఉంటారు,కానీ వాటి గురించి అంత‌గా ప‌ట్టించుకుని ఉండ‌రు. అయితే అవి ఎందుకంటే దీర్ఘ చ‌తుర‌స్రాకారంలో ఉన్న ఓ డిజిట‌ల్ స్క్రీన్ పిక్స‌ల్స్‌కు అనుగుణంగా కనిపించే ప్రాంతం.ఇది వృత్తం, త్రిభుజం వంటి వేరే ఆకారాల్లో ఉంటే స‌రిగా బొమ్మ క‌నిపించ‌దు. దీర్ఘ చ‌తుర‌స్రాకారంలో ఉంటేనే పిక్చ‌ర్, స్క్రీన్ బాగా క‌నిపిస్తుంది.అందుకే ఫోన్ల‌ను కూడా దీర్ఘ చ‌తుర‌స్రాకారంలోనే త‌యారు చేయ‌డం మొద‌లు పెట్టారు.ఫోన్లు ఆ ఆకారంలో రావ‌డానికి గ‌ల కార‌ణాల్లో ఇదొక‌టి.



మీకు పిక్స‌ల్స్ అంటే తెలుసుగా.చిన్న‌పాటి చుక్క దానికి అనువైన చ‌తుర‌స్రంలో ప‌ట్టే ప్ర‌దేశం.అది మొత్తం చ‌తుర‌స్రాకారం లోనే స్క్వేర్ మాదిరిగా ఉంటుంది.పిక్స‌ల్ కూడా అదే ఆకారంలో ఉంటుంది.ఈ క్ర‌మంలో చ‌తుర‌స్రాకారంలో ఉండే పిక్స‌ల్ దీర్ఘ‌చ‌తుర‌స్రాకారంలో ఉండే స్క్రీన్‌లోనే స‌రిగ్గా ఇముడుతుంది.అంతేకానీ వృత్తంలో ఇమ‌డ‌దు.కొన్ని పిక్సల్స్ ఫ్రేమ్ బ‌య‌టికి వ‌చ్చేస్తాయి.వృత్తంలో క‌న్నా దీర్ఘ‌చ‌తుర‌స్రాకారంలోనే ప‌దాలు పూర్తిగా నిండుతాయి.అందుకే ఫోన్ల‌ను కూడా అదే ఆకారంలో త‌యారం చేయ‌డం మొద‌లు పెట్టారు.ఇది మ‌రో కార‌ణం.



ఇక ఫోన్లు దీర్ఘ చ‌తుర‌స్రాకారంలోనే త‌యారు కావ‌డానికి గ‌ల ఇంకో కార‌ణ‌మేమిటంటే వృత్తం లేదా త్రిభుజం వేటిని తీసుకున్నా వాటి చుట్టుకొల‌త చాలా త‌క్కువ‌గా ఉంటుంది. అదే దీర్ఘ చ‌తుర‌స్రం అయితే చుట్టుకొల‌త ఎక్కువ వ‌స్తుంది. అందుకే ఫోన్ల‌ను ఆ ఆకారంలో త‌యారు చేస్తున్నారు.అంతేకాదు,ఆ ఆకారంలో ఉన్న వ‌స్తువులే చేతితో ప‌ట్టుకోవడానికి జేబులో పెట్టుకోవడానికి అనువుగా ఉంటాయ‌ట‌.ఫోన్‌నైతే జేబులో పెట్ట‌గ‌లం,కానీ వృత్తం ఆకారంలో ఉండే సీడీ లేదా డీవీడీని జేబులో పెట్ట‌లేం క‌దా. అందుకే ఫోన్లను దీర్ఘ చ‌తుర‌స్రం ఆకారంలో త‌యారు చేస్తున్నారు.ఇప్పుడు తెలిసిందిగా సెల్‌ఫోను రూపురేఖల కధ.. 


మరింత సమాచారం తెలుసుకోండి: