ల్యాప్‌టాప్‌.ఒక‌ప్పుడు కేవ‌లం కొంత మంది వ‌ద్ద మాత్ర‌మే ఉండేది.కానీ ఇప్పుడ‌ది సామాన్య జ‌నాల‌కు కూడా ద‌గ్గ‌రైంది.చాలా సుల‌భంగా ఇప్పుడు ఎవ‌రైనా ల్యాప్‌టాప్‌ల‌ను కొంటున్నారు.ల్యాప్‌టాప్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంటి నుంచే పనిచేసే సౌకర్యం పెరిగింది. కాకపోతే,కొన్నిసార్లు ఎక్కువసేపు ల్యాప్‌టాప్ వాడడంతో బ్యాటరీ తొందరగా ఖర్చయిపోతుంది.మీ ల్యాప్‌టాప్ బ్యాటరీ ఆదా చేసుకోవాలంటే ఈ చిన్ని చిట్కాలు పాటించండి.ఆ చిట్కాలేంటో ఇప్పుడు చూద్దాం.



ల్యాప్‌టాప్‌కు జతచేసిన ఎక్స్‌ట్రా యూఎస్బీ,ఇతర ఎక్స్‌టర్నల్ డివైజ్‌లను తొలగించండి.లేదంటే దీంతో బ్యాటరీ లైఫ్ పెరుగుతుంది.
సీడీ,లేదా డీవీడీ డ్రైవ్‌లను ఖాళీగా ఉంచండి.అవసరమైనప్పుడు మాత్రమే అందులో డిస్క్ వేయండి.లేదంటే..అనవసరంగా ల్యాప్‌టాప్ బ్యాటరీ ఖర్చయిపోతుంది.
ల్యాప్‌టాప్ స్క్రీన్ బ్రైట్‌నెస్‌ను ఎక్కువశాతం తక్కువ పెట్టుకోవడానికే ప్రయత్నించండి.
మల్టీమీడియా సాఫ్ట్‌వేర్‌లకు దూరంగా ఉంటే దాదాపు బ్యాటరీ ఆదా అయినట్టే.
స్క్రీన్‌సేవర్లు పెట్టకపోవడమే బెటర్.ఎందుకంటే వాటి వల్ల  అదనంగా బ్యాటరీ ఖర్చవుతుంది.



వీలైనంత తొందరగా ల్యాప్‌టాప్ మీద పనులను ముగించుకోండి.ఎక్కువసేపు ల్యాప్‌టాప్ వాడొద్దు.
వీలైనంత వరకు ల్యాప్‌టాప్‌ను వేడికి దూరంగా ఉంచండి.గాలి తగిలే చోట ఐతే బెటర్.
ల్యాప్‌టాప్‌లోని సాఫ్ట్‌వేర్ డ్రైవర్లు ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేయండి.
లాస్ట్.. బట్ నాట్..లీస్ట్..ల్యాప్‌టాప్ చార్జింగ్ పెట్టడానికి తప్పని సరిగ్గా ఒరిజినల్ అడాప్టర్‌ని మాత్రమే ఉపయోగించండి.
చదివారుగా మీ బ్యాటరీని వీలైనంతాగా సేవ్  చేయండి.ల్యాప్‌ట్యాప్ ను లాంగ్ టైం పాడుకాకుండా కాపాడుకోండి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: