మీరు కూల్ డ్రింక్స్ తరచూ తాగుతూ ఉంటారా? అయితే  కూల్‌ డ్రింక్స్‌తో కాస్త జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నారు పరిశోధకులు. కూల్ డ్రింక్‌లో చక్కెర మరియు గ్యాస్ ఉంటుంది. కూల్ డ్రింక్‌లో ఏడు చెంచాల చక్కెరకు సమానమైన తీపి ఉంటుంది. తియ్యటి పానీయాలతో క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు. సుమారు లక్ష మందిపై ఐదేళ్ల పాటు నిర్వహించిన అధ్యయనం ఆధారంగా సోర్బోన్‌ పారిస్‌ సిటీ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని చెబుతున్నారు.


అలాగే బరువు తగ్గాలనుకునేవారు కూల్‌డ్రింక్స్‌కి దూరంగా ఉండడం చాలా మంచిది. కూల్‌డ్రింక్స్‌లో సోడా శాతం అధికంగా ఉంటుంది. దీని వల్ల తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమై మళ్లీ మళ్లీ తింటాం. దాంతో.. బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మానవ శరీరంలో ఎముకలు చాలా గట్టివి. అలాంటి ఎముకల్ని కూడా పిండి పిండి చేయగల సత్తా ఈ కూల్ డ్రింక్స్ కి ఉంది. కూల్ డ్రింక్ లో వుండే ఫాస్పారిక్ యాసిడ్ ఎముకల్లో వున్న కాల్షియంను తినేస్తుంది.


అలాగే తియ్యటి పానీయాల వల్ల హృద్రోగాలు, ఊబకాయం, మధుమేహం ముప్పు పెరుగుతుందని ఇదివరకు అధ్యయనాలు తేల్చాయి. అయితే తాజాగా జ‌రిపిన‌ అధ్యయనం క్యాన్సర్‌ ముప్పు కూడా ఉండొచ్చని సూచిస్తోంది. అలాంటి డ్రింక్స్‌ను తీసుకోవడం తగ్గిస్తే మంచిద‌ని పరిశోధకులు చెప్పారు. శరీరంలో ప్రతీ భాగాన్నీ పాడు చేయగల సత్తా కూల్ డ్రింక్స్ కి ఉంది.   



మరింత సమాచారం తెలుసుకోండి: