భారత్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ , హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అజహరుద్దీన్ కుమారుడు అసద్  , టెన్నిస్ స్టార్ సానియా మీర్జా సోదరి ఆనం వివాహం ఈ ఏడాది డిసెంబర్ లో జరగనుంది . వీరిద్దరి మధ్య గతకొంతకాలంగా ప్రేమాయణం కొనసాగుతున్నట్లు తెలుస్తోంది . ఈ విషయాన్ని తెలుసుకున్న ఇరు కుటుంబాల పెద్దలు చర్చించుకుని పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం .  ఇద్దరిది క్రీడా నేపధ్యం ఉన్న కుటుంబమే కావడంతో రెండు కుటుంబాల పెద్దలు తమ పిల్లల  పెళ్ళికి సుముఖత వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది  .


 ఆనం పెళ్లి ఇప్పటికే హైదరాబాద్ కు చెందిన అక్బర్  రషీద్ తో జరిగింది . వీరిద్దరి  మధ్య బేదాభిప్రాయాలు తలెత్తడం తో, ఆనం , అక్బర్ తో విడాకులు తీసుకున్నారు . అక్బర్ కు ఆనం దూరంగా ఉంటున్న సమయం లోనే అసద్ తో పరిచయం ఏర్పడినట్లు, ఆ పరిచయం కాస్త ప్రేమగా మారినట్లు తెలుస్తోంది . అక్బర్ రషీద్ తో ఆనం కు చట్టబద్దంగా   విడాకులు తీసుకోవడంతో , అసద్ తో పెళ్ళికి ఆమె కుటుంబ సభ్యులు, అజహర్ కుటుంబం తో సంప్రదింపులు జరపడం , వారు కూడా ఒకే చెప్పడంతో డిసెంబర్ లో పెళ్లి చేయాలని నిర్ణయించారు .


  ఈ విషయాన్ని సానియా మీర్జా ఆదివారం రాత్రి ఢిల్లీ లో జరిగిన ఒక కార్యక్రమం లో వెల్లడించారు . అజహర్ మొదటి భార్య తనయుడైన అసద్ , జూనియర్ క్రికెటర్ గా ప్రతిభాపాటవాలను ప్రదర్శించాడు . ఇక అజహర్ భారత జట్టు కు ప్రాతినిధ్యం వహించడమే కాకుండా ఇటీవల జరిగిన హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎన్నికల్లోనూ విజయం సాధించాడు . గతం లో కాంగ్రెస్ తరుపున ఎంపీగా వ్యవహరించాడు .  


మరింత సమాచారం తెలుసుకోండి: