స్పెర్మ్ కౌంట్ తగ్గితే నష్టం ఏమిటి అంటే అందరికి తెలిసిందే, అసలు స్పెర్మ్ కౌంట్ ఎందుకు తగ్గుతుంది, ఈ కౌంట్ పెంచుకోవాలంటే ఎడా పెడా ఇంగ్లిష్ మందులు వాడకుండా సహజసిద్ధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయాలు ఈ కాలంలో ఉన్న మగవాళ్ళు తెలుసుకోవాలి. టెక్నాలజీ పెరుగుతోంది కదా అంటూ దానివేనుకే పాకులాడితే, టెక్నాలజీ కి ఎడిక్ట్ అయిపోతే భవిష్యత్తులో పిల్లలు పుట్టడం కూడా పెద్ద సమస్యగా మారిపోతోంది. ప్రస్తుతం ఇప్పుడు అదే జరుగుతోంది. పిల్లలు పుట్టక ఇబ్బందులు పడుతున్న వారు ఇప్పుడు అధికమవుతున్నారు. ఈ క్రమంలోనే ఎన్నో డిప్రెషన్స్ , మరెన్నో చికాకులు జీవితంలో ఎంటర్ అయ్యి చికాకు పెడుతాయి. అందుకే సహజంగానే స్పెర్మ్ కౌంట్ పెంచుకుని ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉండటానికి కొన్ని చిట్కాలు ఇక్కడ చెప్పడం జరుగుతోంది.

 

బరువు అధికంగా ఉండే వారికి ఈ సమస్య ఎదురవుతుంది. అధిక బరువు గలవారికి శుక్ర కణాలు సంఖ్య దాదాపు తగ్గిపోతుంది. అందుకే శారీరక శ్రమ తప్పకుండా ఉండాలి. మంచి నిద్ర కూడా బరువుని తగ్గిస్తుంది. వంటిలో అధికంగా ఉండే కొవ్వు ఎప్పుడైతే తగ్గుతుందో సులభంగా స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది.

 

ఒత్తిడి అధికంగా ఉన్నవారికి కూడా స్పెర్మ్ స్థాయి తగ్గిపోతుంది. రోజు వారి టెన్షన్స్ మనుషులకే వస్తాయి. జీవితంలో అవి సహజం అనుకోవాలి. ఆఫీసు విషయాలు ఆఫీసులోనే వదిలేసి రండి. సమస్యలు ఇంటి వరకూ తెచ్చుకుని టెన్షన్ పడితే మరింత ఒత్తిడికి లోనవుతారు. అందుకే ప్రకృతిలో తిరగడం, సరదాగా గడపడం చేస్తూ ఉంటే ఒత్తిడి దూరం అవుతుంది.పొగ త్రాగడం, మద్యం సేవించడం చేసేవారు అవి మానుకుంటే మంచిది. ఈ రెండు చెడు కారణాల వలన ఆరోగ్యం పాడవడం మాత్రమే కాకుండా స్పెర్మ్ కౌంట్ పూర్తి స్థాయిలో తగ్గిపోతుంది.

 

అలాగే శరీరంలో విటమిన్లు సరైన మోతాదులో లేకపోయినా సరే స్పెర్మ్ కౌంట్ తగ్గుతుంది. ముఖ్యంగా విటమిన్ “డి “ తగ్గకుండా కాల్షియం స్థాయి కూడా తగ్గకుండా చూసుకోవాలి. అలాగే ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉండాలి, యాంటీయాక్సిడెంట్ ఉండే పళ్ళు ఎక్కువగా తీసుకోవాలి. మంచి నీళ్ళు ఎక్కువగా త్రాగాలి. అలాగే అశ్వగంధ అనే మూలికలు తీసుకోవాలి. ఇప్పుడు మర్కెట్స్ లో ఈ పొడి దొరుకుంది కాబట్టి ఆయుర్వేద వైద్యుల సలహా మేరకు ఈ పొడిని వాడుతూ ఉండండి. తప్పకుండా మీ స్పెర్మ్ కౌంట్ పెరగడమే కాకుండా మానసిక ఆరోగ్యం కూడా వృద్ది చెందుతుంది.  


మరింత సమాచారం తెలుసుకోండి: