సాధార‌ణంగా చాలా మందికి పెర్ఫూమ్స్ వాడే అల‌వాటు ఉంటుంది. పెర్ఫూమ్‌ లేనిదే బయటికి వెళ్లడానికి కూడా ఇష్ట‌ప‌డ‌ని వారు ఉంటారు. అయితే పెర్ఫ్యూమ్స్, బాడి స్ప్రే వాడటం అనారోగ్యకరం అనేది ఒక ప్రమాదకరమైన నిజం. పెర్ఫ్యూమ్స్ ని తయారుచేయడానికి రకరకాల కెమికల్స్ వాడతారు. వీటి తయారిలో ట్రైక్లోసన్ అనే పెస్టిసైడ్ కూడా ఉపయోగిస్తారు. ఇది ఏరకంగానూ మీ చర్మ ఆరోగ్యానికి మంచిది కాదు.


అధికంగా సెంట్, పెర్ఫ్యూమ్స్ వాడడం వల్ల డిప్రెషన్ సమస్య పెరుగుతుంది. అది నానాటికీ ఎక్కువై, వైద్యానికి కూడా అందనంత స్థాయికి చేరుతుందంటున్నారు పరిశోధకులు. అందువల్ల వీలైనంతవరకూ సెంట్లు, పెర్ఫ్యూమ్స్‌కి దూరంగా ఉండమంటున్నారు. అలాగే గర్భిణీ స్త్రీలు పెర్ఫ్యూమ్స్ బాటిల్స్ పై మక్కువ చూపిస్తే అది బిడ్డకే ప్రమాదం. ప్రాణాపాయ స్థితి ఉన్నా లేకున్నా, బిడ్డ ఏదో ఒక లోపంతో పుట్టే ప్రమాదం ఉంటుంది.


మార్కెట్లో దొరుకుతున్న చాలా పెర్ఫ్యూమ్స్ లో అలుమినియం డిరైవెటివ్స్ ఉంటున్నాయి. ఈ కారణంతో మతిమరుపు వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెప్పాయి. అదే విధంగా పెర్ఫ్యూమ్స్‌ వాడేవారిలో 2శాతం మంది విష ప్రభావాలు ఎదుర్కొంటున్నారు. సో బీ కేర్‌ఫుల్‌..!


మరింత సమాచారం తెలుసుకోండి: