సాఫ్ట్ వేర్ కంపెనీ అంటే ఎంతసేపూ కంప్యూటర్లు, కాన్ఫరెన్సులు, కెఫెటేరియాలు ఇలా బిజీ బిజీగా లైఫ్‌ను కొన‌సాగిస్తుంటారు. పగలూ రాత్రి షిఫ్టుల్లో మెషీన్‌లా పనిచేస్తూనే ఉంటారు. ప్రస్తుతం బిజీ బిజీ షెడ్యూల్ తో జీవితాన్ని సాగిస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తమ ఆరోగ్యంపై దృష్టిపెట్టడంలేదని తాజాగా ఒక ప్రముఖ సంస్థ నిర్వహించిన సర్వేలో తేలింది. అయితే రోజుకు దాదాపు 10 గంట‌లు ఒకే చోటు కూర్చుని ప‌ని చేయ‌డం వ‌ల్ల అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తున్న‌ట్టు స్పష్ట‌మైంది.


అలాగే సగటున ప్రతి పదిమంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులల్లో ఏడుగురి కండరాలు అత్యంత బలహీనంగా ఉన్నాయి. ఆహారపు అలవాట్లు,మారుతున్న జీవన శైలి,ప్రోటీన్లు సమృద్ధిగా తీసుకోకపోవడం.. సరైన వ్యాయామం లేకపోవడమే దీనికి ప్రధాన కారణమని ఈ సర్వేలో తేలింది. సాఫ్ట్ వేర్ కంపెనీల‌లో ప‌ని చేసే వారికి షుగర్, బీపీ స‌మ‌స్య‌ల‌కు ఎక్కువ‌గా వ‌స్తున్న‌ట్టు ఓ స‌ర్వేలో తేలింది.


అయితే దేశ వ్యాప్తంగా పలు సాఫ్ట్ వేర్ సంస్థల్లో ఉద్యోగం చేస్తున్నవారిపై ఓ స్థ సర్వే నిర్వహించ‌గా.. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తీవ్ర ఒత్తిడికి గుర‌వుతున్న‌ట్టు తెలుస్తోంది. ఇత‌ర ఉద్యోగుల‌తో పోలిస్తే వీరి మాన‌సిక స్థితి చాలా త‌క్కువ‌గా ఉన్న‌ట్టు తెలిసింది. అందుకే త‌గిన ఆరోగ్య జాగ్ర‌త్త‌లు.. వ్యాయామాలు.. ఆహార‌పు అల‌వాట్లు ఖ‌చ్చితంగా పాటించాల‌ని నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: