మద్యం అనేది మనిషి జీవితంలో ఓ భాగమైంది.చిన్న చిన్న ఫంక్షన్స్ నుండి పెద్ద పెద్ద పార్టీలవరకు. విషాదం నుండి వినోదం వరకు, ఇది మనషుల మద్య కలసిపోయింది. మందుకు బానిసైన వారు ఇంకేం లేకున్నా ఉంటారేమో గాని నోటిలో చుక్క పడకుంటే ఉండలేరు. ఇక బార్‌లో గాని బయటగాని మందు మస్తుగా తాగి ఇంటికి ఎలా వెళ్లుతామనే చింత మందు తాగిన వారిలో వుంటుంది. ఎందుకంటే పోలీస్ మామలున్నారు కదా.  రోడ్ల మీద పెగ్గేసి వారికి పట్టుబడ్డామనుకో జేబులకు పెద్ద పెద్ద చిల్లులు, కోర్టు కేసులు, ఎందుకొచ్చిన గొడవలు, లేనిపోని తలనొప్పులు అని అనిపిస్తుంది.  కొన్ని కొన్ని సందర్భాల్లో ఐతే తెగచికాకు కూడ కలుగుతుంది..


పోని మందు తాగకుండా వుందామంటే తాగుడు అలవాటు పడిన ప్రాణం అసలు ఊరుకోదు. అందుకే ఇలాంటి వారికోసం ఆలోచించిన ఓ సంస్ధ  ఇక హాయిగా తాగండి, హ్యాపిగా ఇంటికెళ్లండి. మీకు ఎలాంటి ఇబ్బందిని లేకుండా మేము చూస్తాము అని ముందుకొచ్చింది. అందుకోసం కిరాయి డ్రైవర్లను అందుబాటులోకి తెచ్చింది..ఇక తెల్లవారు జాము నుంచి అర్ధరాత్రి వరకూ.. అనుభవం గల డ్రైవర్లను ఏ సమయంలో అయినా ఏర్పాటు చేసేందుకు వీలుగా పలు సంస్థల యాప్‌ల  ద్వారా సేవలు అందిస్తున్నాయి. ఎలాగంటే ఈ సేవల కోసం నగరంలో 3-4 యాప్‌ల ద్వారా అద్దె డ్రైవర్ల సేవలు అందుబాటులో ఉన్నాయి.


బెంగళూరు, చెన్నై, హైదరాబాద్  కేంద్రంగా పనిచేస్తున్న సంస్థల్లో సుమారు 600 మంది వరకూ ఉద్యోగులు రేయింబవళ్లు కాల్ సెంటర్  ద్వారా సేవలు అందిస్తున్నారు. ఈ సేవల వల్ల నగరంలో ప్రస్తుతం సుమారు 1000 మంది డ్రైవర్లకు ఉపాధి లభించింది. ఒక్కోడ్రైవర్ రాత్రి సమయంలో విదులను నిర్వహిస్తే రోజూ రూ.500-800 వరకూ సంపాదించుకునే అవకాశం ఉంటుందని డ్రైవింగ్  లైసెన్స్  ఉన్న యువకులు చెబుతున్నారు.


ఇక పోతే శుక్ర, శని, ఆదివారం ఈ మూడురోజుల పాటూ మంచి డిమాండ్  ఉంటోందని ఓ డ్రైవర్ తెలిపాడు. ఇక ఈ యాప్  డౌన్ లోడ్ చేసుకున్న వారు.. తాము ఉన్న ప్రదేశం వివరాలు పంపితే చాలు.. 10-15 నిమిషాల్లో డ్రైవర్ ను పంపి క్షేమంగా ఇల్లు చేరుస్తారు. అందుకుగాను కిలోమీటర్ కు రూ.50-60 వరకూ చెల్లించాల్సి ఉంటుంది. ఇక పోతే రాత్రి వేళల్లో ఈ మొత్తం కాస్త అధికంగా ఉంటుంది. ఇక పుల్‌గా తాగిన, దిల్‌గా రోడ్డుమీద భయపడకుండా ఇంటికి వెళ్ళచ్చూ అనుకుంటున్నారు ఈ విషయం తెలిసిన మందుబాబులు.

మరింత సమాచారం తెలుసుకోండి: