ధనం మూలం ఇదం జగత్ అని అన్నారు పెద్దలు, అంటే డబ్బు లేనిదే ఈ జగత్ పై ఏమి లేదు, డబ్బే అన్నిటికీ మూలం అని చెప్పకనే చెప్పారు. ఇప్పుడు ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతోంది. ఏమీ లేనివాళ్లు కోట్లకు పడగలెత్తుతున్నారు. కోట్ల ఆస్తులున్నవాళ్లు చివరకు చిల్లిగవ్వలేని పరిస్థితిలోకి వెళ్తున్నారు. కారణం మనీ మేనేజ్‌మెంట్.. ఇకపోతే మన దేశంలోని అపర కుబేరుల్లో ప్రథమ స్థానం ఎవరిదో అందరికీ తెలిసిందే. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ. ఈయన మన దేశంలోకెల్లా అత్యంత సంపన్నుడే కాదు, ప్రపంచ కుబేరులో జాబితాలో 17వ స్థానం కూడా ఈయనదే. ఈ విషయాన్ని ఈ మధ్యనే బ్లూమ్ బర్గ్ ఇండెక్స్ వెల్లడించింది. పురుషుల్లో ముఖేశ్ అంబానీని మించిన సంపన్నుడు దేశంలోనే లేడు. మరి మహిళల సంగతేంటో అనుకుంటే వారిలో కూడా టాప్ రేంజ్‌లోనే వున్నవారు ఉన్నారు.వారు దేశంలోని టాప్ 5 మహిళా శ్రీమంతులు.ఇంతకు వారిపేర్లేంటో వారి ఆదాయం ఎంతో ఇప్పుడు తెలుసుకుందాం.


టాప్ ప్లేస్‌లో.. రోష్నీ నాడార్.  ప్రస్తుతం హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజెస్ ముఖ్య కార్యనిర్వహణ అధికారిణి(సీఈవో)గా రోష్నీ నాడార్ ఉన్నారు. ఈమె దేశీయ బిలియనీర్, హెచ్‌సీఎల్ కంపెనీ వ్యవస్థాపకుడైన శివ నాడర్ కుమార్తె. హెచ్‌సీఎల్ ఎంటర్‌ప్రైజెస్ అనేది ప్రముఖ ఐటీ కంపెనీ హెచ్‌సీఎల్ టెక్‌‌కు మాతృ సంస్థ. 37 ఏళ్ల వయసున్న రోష్నీ నాడార్ సంపద విలువ రూ.36,800 కోట్లుగా ఉంది.


రెండో స్థానంలో.. స్మిత వి కిృష్ణ. ఇక దేశంలోని అత్యంత సంపన్న మహిళల్లో రోష్నీనాడార్ తరువాతి స్థానంలో స్మిత వి కిృష్ణ ఉన్నారు. ఈమె గోద్రేజ్ వ్యాపార సామ్రాజ్యంలో థర్డ్ జనరేషన్‌కు చెందిన వారు. ప్రఖ్యాత అణు భౌతిక శాస్త్రవేత్త హోమీ జె భాభాకు చెందిన బంగళాను 2014 లో కొనుగోలు చేసింది ఈమే. ప్రస్తుతం స్మిత వి కిృష్ణ సంపద విలువ రూ.31,400 కోట్లు. 


మూడో స్థానంలో.. కిరణ్ నాడార్.  దేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో మూడో స్థానంలో నిలిచారు కిరణ్ నడార్. ఈమె వయసు 67 ఏళ్లు. ఈమె దేశీయ బిలియనీర్, హెచ్‌సీఎల్ కంపెనీ వ్యవస్థాపకుడైన శివ నాడర్ సతీమణి. రోష్నీ నాడార్‌కు తల్లి. కిరణ్ నాడార్ తన భర్త శివ నాడార్ స్థాపించిన ట్రస్టు శివ నాడార్ ఫౌండేషన్‌కు ట్రస్టీగా ఉన్నారు. ఈమె సంపద విలువ రూ.25,100 కోట్లు. 


నాలుగో స్థానం.. కిరణ్ మజుందార్ షా.. ఇక నాలుగో స్థానంలో బయోకాన్ ఫార్మా కంపెనీ వ్యవస్థాపకురాలు కిరణ్ మజుందార్ షా ఉన్నారు. 1978లో ఈమె స్థాపించిన బయోకాన్ 2004లో విజయవంతంగా ఐపీవోకు వచ్చింది. ప్రస్తుతం బయోకాన్‌కు ఛైర్‌పర్సన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ అయిన మజుందార్ షాకు ట్విట్టర్‌లో 1.5 మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. గతంలో పద్మశ్రీ, పద్మభూషణ్ వంటి పురస్కారాలు కూడా లభించాయి. ఈమె సంపద విలువ రూ. 18,500 కోట్లు. 


ఐదో స్థానంలో.. మంజు దేశ్‌బంధు గుప్తా.. దేశంలోని అత్యంత సంపన్న మహిళల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నవారు మంజు దేశ్‌బంధు గుప్తా. ఈమె సంపద విలువ రూ.18,000 కోట్లు. ఈమె ఫార్మా కంపెనీ ‘ల్యుపిన్' వ్యవస్థాపకుడైన దేశ్‌బంధు గుప్తా సతీమణి. భర్తతో పాటు అదే కంపెనీలో నాలుగు దశాబ్దాలకు పైగా బోర్డు మెంబర్‌గా ఉన్న మంజు గుప్తా 2017 వరకు ఆ కంపెనీకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కూడా వ్యవహరించారు. ఆ తరువాత అదే కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు..

మరింత సమాచారం తెలుసుకోండి: