మాములుగా దొంగ ఇంటిలోకి చొరబడి బెదిరిస్తే ఏమి చేయగలం, వాళ్ళు చెప్పినట్టు వినటం తప్ప. కొందరు దొంగలు ఒంటరి మహిళలను టార్గెట్ గా చేసుకుని వారి ఇళ్ళల్లో దొంగతనాలు చేస్తారు. ఏదోఒక కారణంతో ఇంటిలోకి ప్రవేశించి అదును చూసుకొని వారిని భందించి ఇల్లు మొత్తం దోచుకెళతారు. ఇంకా కిరాతకులు అయితే వారిని హాతమర్చి దొంగతనాలు చేసిన సంఘటనలు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ  ఇక్కడ ఇందుకు భిన్నంగా ఒక మహిళ దొంగానే పరుగులు పెట్టించింది... అసలు కధ ఏంటంటే...

 

చైనాలోని హుబై నగరానికి చెందిన ఓ ఇంట్లో ఒంటరిగా మహిళ ఉంటోంది. అదే అదునుగా చూసుకున్న దొంగ ఆమె ఇంటి కిటికీలు బద్దలు కొట్టి   లోపలికి చొరబడ్డాడు. ఆమె మెడపై కత్తి పెట్టి బెదిరించాడు. ఇదే పరిస్థితి మరెవరికైనా ఎదురైతే పై ప్రాణాలు పైనే పోతాయి..కానీ ఆమె మాత్రం ఎంతో చాకచక్యంగా వ్యవహరించింది. ఎలా తప్పించుకోవాలో ఆలోచిస్తున్న ఆమెకి ఒక అద్భుతమైన ఉపాయం తట్టింది. అనుకున్నదే తడవుగా ఆచరణలో పెట్టింది...అదేంటంటే...

 

దొంగ అడుగుతున్న వాటికి సమాధానం చెప్తూనే, మెల్లగా దగ్గడం మొదలు పెట్టింది, ఇది గమనించిన ఆ దొంగ ఏమైందని ఆ మహిళను అడిగాడు. తను అనుకునట్టుగానే దొంగ స్పందిచడంతో ఆ మహిళ తన తయారు చేసుకున్న స్క్రీన్ ప్లే ను పూర్తిగా అమలు చేసింది...తాను రెండు రోజుల క్రితమే వూహన్ నగరం నుంచి వచ్చానని, అప్పటి నుంచి దగ్గు, తలనొప్పి, ముక్కు నుంచి నీరు కారుతున్నాయని, బహుశా కరోనా సోకిందేమోనన్న అనుమానం ఉందని చెప్పింది. అంతే అప్పటిదాక ఆ మహిళను ఎటూ కదలకుండ గట్టిగ పట్టుకున్న ఆ దొంగ దెబ్బకి వదిలేసి పరుగులందుకున్నాడు. దాంతో ఆ మహిళ స్థానికంగా ఉన్న పోలీసులకి ఫిర్యాదు చేసింది, ఆమె చెప్పిన దాని ప్రకారం ఆ ఏరియా సీసీటీవీ ఫుటేజ్ సహాయంతో దొంగ ను అదుపులోనికి తీసుకున్నారు పోలీసులు..

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: